టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ఎద్దేవా చేశారు. ‘ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును బాబు లాక్కున్నారు. టీడీపీ నేతలు తెలివి తక్కువ దద్దమ్మలు. నాకు చంద్రబాబులాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు. సీఎం జగన్ కుర్చీలో నేను కూర్చోలేదు. సీఎం సమీక్షలు నిర్వహించే గదిలో కూర్చున్నా. జగన్ తలచుకుంటే ఎవ్వరినైనా ఎక్కడైనా కూర్చోబెడతారు’ అని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అసలు ఏంజరిగిందటే..
బుధవారం పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను సచివాలయంలో నిర్వహించారు. ఇన్నాళ్లూ మంత్రిగా తన సీటులో కూర్చొని సమీక్షలు నిర్వహించిన మంత్రి నిన్న సీఎం కూర్చునే సీటులో కూర్చొని సమీక్ష చేపట్టారు. సీఎం కుర్చీలో మంత్రి అమర్నాథ్ కూర్చోవడంపై సీఎంఓ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం ఛైర్లో కూర్చొని మంత్రి అమర్నాథ్ రివ్యూ చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో, ఆ వీడియోను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఈ అంశంపై జీఏడీ అధికారులకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. మంత్రి గుడివాడ తీరుపై వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరి కొందరు మాత్రం సోషల్ మీడియాలో వ్యంగంగా స్పందిస్తున్నారు. పాపం మంత్రి CM కావాలనుకున్నాడేేమో అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
Read Also : TTD: ఫిబ్రవరి 16న శుక్రవారం రథసప్తమి, తిరుమల ముస్తాబు