Volunteer System: పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో అలజడి రేపాయి. దేశవ్యాప్తంగా ప్రముఖులు వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తే పవన్ కళ్యాణ్ ఆ వ్యవస్థ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఆరోపించడం అందర్నీ అయోమయంలో పడేసింది. వాలంటీర్ ఉద్యోగులు ప్రజల డేటా సేకరించి కొందరు దుష్టశక్తులకు చేరవేస్తున్నారని పవన్ వారాహి యాత్రలో చెప్పారు. దాదాపు రెండు లక్షల మంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని, వారు కేవలం సీఎం జగన్ కోసమే పని చేస్తున్నారని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో ఒంటరి మహిళలను గుర్తించి వారిని వేరే చోటకు తరలిస్తున్నట్టు పవన్ కామెంట్స్ చేయడం వైసీపీ నేతలకు మింగుడుపడటం లేదు. దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనీ కోరుకుంటున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
వాలంటీర్ వ్యవస్థపై ఇన్ని ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే వాలంటీర్ మరియు గ్రామ సచివాలయం వ్యవస్థను రద్దు చేసి నాలుగు లక్షల మందిని రోడ్డున పడేస్తారు? అదైనా చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవడంలో విప్లవకారుడని విమర్శించారు గుడివాడ అమర్నాథ్. సీఎం జగన్ ని ఏకవచనంతో పిలుస్తానని పవన్ వ్యాఖ్యలపై అమర్నాథ్ వ్యంగ్యంగా స్పందించారు. సంస్కారం లేని వ్యక్తులు నమస్కారం పెట్టినా ప్రయోజనం ఉండదన్నారు.
Read More: Dhoni Teases Yogi Babu : యోగిని ఆడుకున్న ధోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్