Site icon HashtagU Telugu

Gudivada Amarnath : చంద్రబాబుకు పెట్టే భోజనంపై అనుమానం వ్యక్తం చేసిన మంత్రి అమర్నాథ్

Gudivada Amarnath

Gudivada Amarnath

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో ఆరోపణలు ఎదురుచుకుంటూ గత 33 రోజులుగా ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail) రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. మొదటి నుండి కూడా కుటుంబ సభ్యులు , టీడీపీ శ్రేణులు చంద్రబాబు కు జైల్లో ప్రాణ హాని ఉందని ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి (nara brahmani) ట్విట్టర్ వేదికగా జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ట్వీట్ చేసారు.

అలాగే చంద్రబాబు (Chandrababu Health)కు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారని భువనేశ్వరి తెలిపారు. అంతేకాదు జైలులో సౌకర్యాలు సరిగ్గా లేవని..ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని…జైల్లోని పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక చంద్రబాబు కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) స్పందించారు. చంద్రబాబు జైలులో బరువు పెరిగారు.. ఆయన ఆరోగ్యం పై అనుమానాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదని అమర్నాథ్ అన్నారు. ఇంటి వద్ద నుంచే భోజనం తీసుకుని వచ్చి పెడుతున్నప్పటికీ కూడా మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే …ఇప్పుడు మాకు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాబు లైఫ్ కి ఎలాంటి రిస్క్ లేదు..చంద్రబాబుకి పంపించే భోజనంపై నాకు అనుమానం ఉంది..ఆయనకు పెట్టె భోజనం ముందు లోకేష్ కి తినిపించాలని అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also : KTR : కేసీఆర్ ఫై ఈటెల పోటీ ఫై కేటీఆర్ కామెంట్స్