AP : చంద్రబాబు.. నాదెండ్ల మనోహర్ లను ‘కట్టప్ప ‘ తో పోల్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌

ఆనాడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. ఈనాడు పవన్‌ కల్యాణ్‌కు మనోహర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారని అమర్నాధ్ అన్నారు

Published By: HashtagU Telugu Desk
Gudivada Amarnath

Gudivada Amarnath

మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Minister Gudivada Amarnath) మరోసారి తన నోటికి పనిచెప్పారు. జనసేన పార్టీ ఏ సమావేశం ఏర్పాటు చేసిన , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సభలు నిర్వహించిన దానిపై విమర్శలు, కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలిచే వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌..తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) , జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ (Nadella Manohar) లను కట్టప్ప (Kattappa) తో పోల్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘పవన్ కళ్యాణ్ తో పాటు, నాదెండ్ల మనోహర్‌ కూడా ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని , ఆనాడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. ఈనాడు పవన్‌ కల్యాణ్‌కు మనోహర్‌ వెన్నుపోటు పొడుస్తున్నారని అమర్నాధ్ అన్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే.. మనోహర్‌ చిన్న కట్టప్ప అంటూ సెటైర్ వేసాడు. టీడీపీ పాలనలో జీఎస్‌డీసీ 22వ స్థానంలో ఉంది. నేడు జీఎస్‌డీపీ ఒకటో స్థానంలో ఉంది. జీఎస్‌డీపీ అనేది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చింది.

తలసరి ఆదాయం టీడీపీ హయాంలో 174వ స్థానంలో ఉండగా.. నేడు తొమ్మిదో స్థానంలో ఉంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ద్వారా లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. MSME ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించాం. టీడీపీ పాలనలో వ్యవసాయం రంగంలో 27 స్థానంలో ఉన్నాము. నేడు ఆరో స్థానంలో రాష్ట్రం ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే నేడు మూడో స్థానంలో ఉంది. గుజరాత్ తరువాత మన రాష్ట్రంలో పెట్టుబడులు అధికంగా వచ్చాయని చెప్పుకొచ్చారు.

Read Also : MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

  Last Updated: 16 Nov 2023, 11:59 AM IST