AP : పవన్‌ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్‌ అజ్ఞానవాసి – మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

వైసీపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ (Gudivada Amarnath) మరోసారి జనసేన (Janasena) , టీడీపీ (TDP) లపై నిప్పులు చెరిగారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని అని , పవన్‌ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్‌ అజ్ఞానవాసి అంటూ తనదైన శైలి లో సెటైర్లు వేశారు. సీఎం జగన్ రేపు (గురువారం) ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పలాసలో దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్బంగా మంత్రి […]

Published By: HashtagU Telugu Desk
Gudivada Amarnath

Gudivada Amarnath

వైసీపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ (Gudivada Amarnath) మరోసారి జనసేన (Janasena) , టీడీపీ (TDP) లపై నిప్పులు చెరిగారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని అని , పవన్‌ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్‌ అజ్ఞానవాసి అంటూ తనదైన శైలి లో సెటైర్లు వేశారు. సీఎం జగన్ రేపు (గురువారం) ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పలాసలో దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్బంగా మంత్రి జగన్ టూర్ విశేషాల గురించి తెలుపుతూ..జనసేన , టీడీపీ లపై నిప్పులు చెరిగారు.

జ‌న‌సేన నేత నాదెండ్ల మనోహర్ వి బ్రోకర్ మాటలని, విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని అన్నారు. టీడీపీ, జనసేన విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని. నాదెండ్ల మనోహర్‌ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పవన్‌ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్‌ అజ్ఞానవాసి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి. కొన్ని కంపెనీలకే భూములు కేటాయిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అంటూ మంత్రి అమర్‌నాథ్‌ మండిపడ్డారు.

ఎన్నో ఏళ్లుగా ఉద్దానం ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి.. కిడ్నీ వ్యాధుల బారిన పడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక కిడ్నీ రీసెర్చీ సెంటర్‌ను నెలకొల్పడంతో పాటు అక్కడ్నే ఏర్పాటు చేసిన మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించేందుకు జగన్‌ గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా పలాసలో కొత్తగా ఏర్పడనున్న ఇండస్ట్రీయల్‌ పార్కుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు అని అమర్నాధ్ తెలిపారు.

Read Also : Dharani Portal : ధరణి పోర్టల్ లో లోపాలపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు

  Last Updated: 13 Dec 2023, 11:23 PM IST