Site icon HashtagU Telugu

Pawan Kalyan : ఏపీలో మొదలైన హామీలు – పవన్

Pawan's Warning To Party Ml

Pawan's Warning To Party Ml

ఏపీలో కొత్త ప్రభుత్వం (AP New Government ) కొలువు దీరేందో లేదో అప్పుడే ఎన్నికల్లో ప్రకటించిన హామీలు నెరవేర్చే పనిలో పడింది. బుధువారం ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు (CBN)..ఈరోజు రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్‌, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు. ఇక మెగా డీఎస్సీలో భాగంగా ప్రకటించిన 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ను సీఎస్ ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ హామీల అమలు ఫై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కదా మీము కోరుకుంటుని అని సోషల్ మీడియా వేదికగా కూటమి కి జై జైలు పలుకుతున్నారు. దీనిపై జనసేనాని, రాష్ట్ర మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని తెలిపారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేశారని… ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారని వెల్లడించారు. సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేశారని, ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం… యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు నైపుణ్య గణన ఫైలుపై అయిదో సంతకం చేశారని పవన్ కల్యాణ్ వివరించారు. సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుందని మరోసారి స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు.

Read Also : Chandrababu : శిష్యుడి బాటలో గురువు..?