AP Politics: ఏపీ సీఎం జగన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తుంటే, మరోవైపు పార్టీలోని అంతర్గత సమస్యలు ఆయనకు తలనొప్పిగా మారాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ నాయకులు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పార్టీ కి రాజీనామా చేసారు. వైస్సార్సీపీ కి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కొంతకాలంగా పెందుర్తి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో వర్గపోరు నడుస్తోంది.
పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల మధ్య సీట్ వార్ నడుస్తోంది. ఇటీవల పెందుర్తిలో జరిగిన పరిమాణాలతో రమేష్‌బాబు అసంతృప్తితో ఉన్నారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించారు. పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. అధ్యక్షుడుగా ఎవరికైనా పదవుల్లో న్యాయం జరగకపోతే క్షమాపణ కోరుతున్నానని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. చాలా బాధగా ఉందని అన్నారు.
ఏడాది కాలంగా ఎన్నో సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని చెప్పారు. అందుకు వీలు కాలేదని , క్షేత్రస్థాయిలో సమస్యలను తీర్చలేనప్పుడు పదవిలో ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. తనకు, ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఎలాంటి విబేధాలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికే ఆనం, కోటం లాంటి ఎమ్మెల్యేలు వైసీపీని వీడిన విషయం తెలిసిందే.
Also Read: Fake Marriages: బడాబాబులకు ప్రేమ వల.. 8 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు