Site icon HashtagU Telugu

Group 1 Mains : 2018 గ్రూప్‌-1 మెయిన్స్​ రద్దు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

Group 1 Mains

Group 1 Mains

Group 1 Mains : 2018 సంవత్సరంలో జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్ ఎగ్జామ్‌పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 167 పోస్టుల భర్తీ కోసం అప్పట్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ పరీక్ష నిర్వహించి 6 వారాల్లోగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  గ్రూప్‌-1 మెయిన్స్ ఎగ్జామ్‌ జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు.

Also Read : Khammam: జలగం చేరికతో ఖమ్మం బీజేపీ ఎంపీ సీటు ఆశావహుల్లో పోటీ

నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించాం : ఏపీపీఎస్సీ 

అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.  దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇవాళ  తీర్పును వెలువరించింది. మెయిన్స్‌ జవాబు పత్రాలను రెండో సారి, మూడో సారి మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని హైకోర్టు ధర్మాసనం ఈసందర్భంగా వ్యాఖ్యానించింది. మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఆందోళన చెందొద్దు : ఏపీ ప్రభుత్వం

2018 గ్రూప్-1పై(Group 1 Mains) హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందొద్దని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చింది. వారి తరపున న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని అనౌన్స్ చేసింది. ఈ తీర్పుపై ఎవరికీ ఆందోళన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఈ సందర్భంగా పేర్కొంది.

Also Read :Biden Vs Trump : మరోసారి బైడెన్ వర్సెస్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష అభ్యర్థులు వారే

Exit mobile version