ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక శక్తి రంగానికి మరొక పెద్ద బూస్ట్ లభించింది. కర్నూలు జిల్లాలో బ్రుక్‌ఫీల్డ్ సంస్థ చేపడుతున్న 1,040 మెగావాట్ల హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు రూ.7,500 కోట్ల నిధులను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్‌లో 640 మెగావాట్ల విండ్, 400 మెగావాట్ల సోలార్ సామర్థ్యం ఉంటుంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.9,910 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది ఇప్పటివరకు ప్రైవేట్ రంగ ప్రాజెక్ట్‌కు REC అందించిన అతి పెద్ద ఆర్థిక సహాయం కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ అమలుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ శక్తి ఉత్పత్తిలో జాతీయస్థాయిలో ముందంజలో నిలవనుంది.
ICC Womens World Cup 2025 : రోహిత్ శర్మ ఎమోషనల్..మ్యాచ్ మొత్తం అయ్యేవరకూ గ్రౌండ్‌లోనే..!
ఈ ప్రాజెక్ట్‌ను బ్రుక్‌ఫీల్డ్ మరియు యాక్సిస్ ఎనర్జీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈవ్రెన్ (Evren) ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈవ్రెన్ సంస్థ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 3 గిగావాట్లకు పైగా ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. బ్రుక్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8,000 మెగావాట్ల సామర్థ్యంతో రూ.50,000 కోట్ల పెట్టుబడితో రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను అమలు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి సలహాదారు, మానవ వనరుల, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ 2025 ఆగస్టులో లండన్‌లో బ్రుక్‌ఫీల్డ్ గ్లోబల్ ప్రెసిడెంట్ కానర్ టెస్కేతో సమావేశమై సహకార అవకాశాలపై చర్చించారు. ఆ భేటీ ఫలితంగానే ఈ భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు మరలినట్లు తెలుస్తోంది.
ICC Womens World Cup 2025 : రోహిత్ శర్మ ఎమోషనల్..మ్యాచ్ మొత్తం అయ్యేవరకూ గ్రౌండ్‌లోనే..!
ఈ ప్రాజెక్ట్ దేశంలోనే తొలిసారిగా “ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రిన్యూవబుల్ ఎనర్జీ (FDRE)” విధానంలో ఆమోదం పొందినదిగా నిపుణులు పేర్కొంటున్నారు. హైబ్రిడ్ విండ్-సోలార్ నిర్మాణానికి బ్యాటరీ నిల్వ వ్యవస్థను జోడించడం ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. ఇది రాష్ట్ర గ్రిడ్ స్థిరత్వాన్ని పెంచడమే కాకుండా పరిశ్రమలకు నమ్మకమైన విద్యుత్ అందించడానికి దోహదం చేస్తుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ దేశంలో రిన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా వేగంగా ఎదుగుతోంది. బ్రుక్‌ఫీల్డ్ వంటి గ్లోబల్ లీడర్లతో కలిసి నూతన మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా పరిశ్రమల పెరుగుదల, ఉపాధి అవకాశాలు, శక్తి భద్రత సాధ్యమవుతున్నాయి” అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి “సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియా”గా నిలబెడుతోందని ఆయన గర్వంగా పేర్కొన్నారు.
