Site icon HashtagU Telugu

Jagan Anakapally : జగన్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ..కాకపోతే !!

Ys Jagan

Ys Jagan

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan) రేపు అనకాపల్లిలో చేపట్టబోయే పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బజా అధికారికంగా ప్రకటించారు. జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చినప్పటికీ, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా కొన్ని కఠిన నియమాలు అమల్లోకి తీసుకువచ్చారు. ఆయన వైజాగ్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఎన్ఏడీ కొత్త రోడ్ – వేపగుంట – సరిపల్లి జంక్షన్ మార్గంలో అనకాపల్లికి వెళ్లాలని సూచించారు. ఈ మార్గంలోనే పర్యటన జరగాలని, ఎటువంటి మార్పులు చేయకూడదని కమిషనర్ స్పష్టం చేశారు.

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు టీడీపీ దూరం

పోలీసుల మార్గదర్శకాల ప్రకారం.. జగన్ పర్యటనలో ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఎటువంటి హాల్ట్‌లు లేదా మార్గ మార్పులు చేయరాదు. ఆయన కాన్వాయ్‌కు సంబంధించిన అన్ని వాహనాలు ముందుగా అనుమతిపొందిన రూట్‌లోనే కదలాలి. ముఖ్యంగా భద్రతా కారణాల రీత్యా జన సమీకరణకు అనుమతి ఇవ్వలేదు. ప్రజా సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, రోడ్ మార్చ్ వంటి కార్యక్రమాలపై పూర్తిగా **నిషేధం విధించారు. పర్యటన సమయంలో ప్రజా రద్దీ పెరగకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరింపులు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల రాజకీయ పర్యటనల సమయంలో జరిగిన కొన్ని అనుకోని ఘటనల నేపథ్యంలో పోలీసులు ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జగన్ పర్యటనలో ఏ విధమైన చట్ట విరుద్ధ చర్యలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రతి జంక్షన్ వద్ద పోలీసులు తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు జరుగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version