APSRTC Jobs: ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో దాదాపు 800 మందికి కారుణ్య నియామకాలు లభించేందుకు మార్గం సుగమం అయింది. ఫలితంగా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త వినిపించింది. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజ మరణం పాలైనా బాధిత కుటుంబాల్లోని అర్హులైన వారికి కారుణ్య నియామక స్కీమ్ కింద అవకాశాన్ని కల్పిస్తారు. వారికి కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ లాంటి విభాగాల్లో ఉద్యోగాలను ఇస్తారు.
Also Read :Meghalaya Earthquake : మేఘాలయ, అసోంలలో భూకంపం.. జనం బెంబేలు
2016 సంవత్సరానికి ముందు..
ఇటీవలే ఏపీఎస్ ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 2016 సంవత్సరానికి ముందు చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సంబంధించిన కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
Also Read :Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు
2016 జూలై నుంచి 2019 డిసెంబరు మధ్య కాలంలో..
2020 జనవరి 1న ఏపీఎస్ ఆర్టీసీని(APSRTC Jobs) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు. 2016 జూలై నుంచి 2019 డిసెంబరు మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మాత్రమే కారుణ్య నియామకాలు కల్పిస్తామని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించింది. 2016 జూలైకి ముందు ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలను కల్పించే అంశాన్ని అప్పట్లో విస్మరించారు. అందుకోసం వివిధ కారణాలను ఆనాడు చూపించారు.
Also Read :HMIL : భారతదేశం అంతటా హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
హైదరాబాద్ నుంచి విజయవాడకు..
హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతిరోజు ఎంతోమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వాళ్లకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్. లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల టికెట్లపై 10 శాతం రాయితీని ఇస్తున్నారు. రాజధాని ఏసీ సర్వీసు బస్సుల టికెట్లపై 8 శాతం రాయితీ ఇస్తున్నారు. ఈ బస్సుల టికెట్ల రిజర్వేషన్ కోసం https://www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.