ఇటీవల కాలంలో కామంతో రెచ్చిపోతున్నారు. వావివరుసలు మరచి అభం, శుభం తెలియని వారిపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తెలియని వ్యక్తులే కాదు తెలిసిన వ్యక్తులు అది కూడా తండ్రి వరసైన వారు..తాత వరసైన వారు సైతం అత్యాచారాలకు పాల్పడుతూ సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నారు. 2017 లో ఈ తరహా ఘటనే చోటుచేసుకోగా..ఈ కేసుకు సంబంధించి తాజాగా వైజాగ్ కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. మనువరాలిపై అత్యాచారం చేసిన తాత కు ఏకంగా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
విశాఖకు చెందిన శ్యామ్ సుందర్ అనే వ్యక్తి 2017లో వరుసకు మనువరాలి అయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి ఈ కేసు కోర్ట్ లో కొనసాగుతూనే ఉంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. బాలికపై అత్యచారానికి పాల్పడ్డ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. కోర్ట్ తీర్పు పట్ల బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేస్తూ..ఇలాంటి తీర్పులు వెంటనే అమలు చేయాలనీ కోరారు.
Read Also : YS Jagan: 12 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు వైఎస్ జగన్ అరెస్ట్.. ఓడితే అంతే..