Pump Sets Deadline: జ‌గ‌న్ కు ఎన్నిక‌ల ఎర్త్! `స్మార్ట్‌` గా షాక్‌!

అనుమానం పెనుభూతంగా మారుతుంద‌ని పెద్ద‌ల సామెత‌. ఆ విష‌యం తెలిసి కూడా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రైతులకు ఉన్న అనుమానాల్ని ప‌క్క‌న ప‌డేసి వాళ్ల సెంటిమెంట్ కు షాక్ ఇస్తున్నారు. వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు స్మార్ట్ మీట‌ర్ల‌ను బిగించ‌డానికి తొంద‌ర‌ప‌డుతున్నారు. సాధార‌ణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న వేళ స్మార్ట్ మీట‌ర్ల బిగింపును వేగ‌వంతం చేయాల‌ని ఆయ‌న ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

  • Written By:
  • Updated On - November 17, 2022 / 03:31 PM IST

అనుమానం పెనుభూతంగా మారుతుంద‌ని పెద్ద‌ల సామెత‌. ఆ విష‌యం తెలిసి కూడా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రైతులకు ఉన్న అనుమానాల్ని ప‌క్క‌న ప‌డేసి వాళ్ల సెంటిమెంట్ కు షాక్ ఇస్తున్నారు. వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు స్మార్ట్ మీట‌ర్ల‌ను బిగించ‌డానికి తొంద‌ర‌ప‌డుతున్నారు. సాధార‌ణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న వేళ స్మార్ట్ మీట‌ర్ల బిగింపును వేగ‌వంతం చేయాల‌ని ఆయ‌న ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్ర వ్యాప్తంగా 18ల‌క్ష‌ల స్మార్ట్ మీట‌ర్ల‌ను బిగించాల‌ని సిద్ధం అయింది. ఆ మేర‌కు టెండ‌ర్ల‌ను డిస్కాంలు పిల‌వ‌డంతో పాటు ఫైన‌ల్ చేయ‌డం జ‌రిగింది. ఒక్కో మీట‌ర్ కు రూ. 6వేల నుంచి రూ. 29వేల వ‌ర‌కు మంజూరు చేయ‌డం ద్వారా ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని సిద్ధం అయింది. వాస్త‌వంగా జూన్ నెలాఖ‌రుకు స్మార్ట్ మీట‌ర్లు అన్ని జిల్లాల్లో బిగించాల‌ని ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ డిస్కంలు లేట్ చేయ‌డం జ‌రిగింది. అందుకే, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాటికి డెడ్ లైన్ పెట్టారు. ఈ ఏడాది ఆఖ‌రికి రాష్ట్రంలోని ప్ర‌తి మోటార్ కు స్మార్ట్ మీట‌ర్ ఉండాల‌ని ఆదేశించారు.

Also Read:  Delhi Liquor Scam: వైసీపీ భీష్ముడు! స్కామ్ ల వేట‌!!

శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ మీట‌ర్ల‌ను బిగించారు. సుమారు 26వేల పంపు సెట్ల‌కు మీట‌ర్ల‌ను ఆ జిల్లాలో బిగించారు. తొలుత 25వేల నుంచి 30వేల వ‌ర‌కు స్మార్ట్ మీట‌ర్లు అవ‌స‌రం అవుతాయ‌ని డిస్కంలు అంచ‌నా వేయ‌గా 26వేల మీట‌ర్ల‌ను బిగించ‌డంతో ప్రాజెక్టు పూర్తి అయింది. అక్కడి అనుభ‌వాల‌ను తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మీట‌ర్ల‌ను బిగించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డిస్కంల‌కు క్లియ‌ర్ ఆదేశాలు ఇచ్చారు. అందుకోసం వ్య‌వ‌సాయ మోటార్లు ఉన్న రైతుల నుంచి ఆధార్ కార్డ్‌, బ్యాంకు అకౌంట్ వివ‌రాల‌ను ఏపీ స‌ర్కార్ సేక‌రిస్తోంది.

రైతుల నుంచి డేటా సేకరణలో జాప్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. డిస్కమ్‌ల సూపరింటెండింగ్ ఇంజనీర్లను (ఎస్‌ఈ) నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం కోరింది. మీటర్ల బిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉంది. రైతులు, ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ మీట‌ర్లను బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. వ్యవసాయ రంగానికి సరఫరా చేసే విద్యుత్ పరిమాణాన్ని అంచ‌నా వేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌క్కా ప్లాన్ చేసింది. స‌ర‌ఫ‌రా, పంప‌ణీ మ‌ధ్య న‌ష్టాల‌ను త‌గ్గించ‌డానికి స్మార్ట్ మీట‌ర్లు ప‌నిచేస్తాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అందుకే, వీలున్నంత త్వ‌ర‌గా మీట‌ర్లను బిగించ‌డానికి సిబ్బంది ఓవర్ టైం పని చేస్తుంద‌ని EPDCL CMD సంతోష్ రావు అన్నారు.

Also Read:  AP, TS Elections: ఏపీ, తెలంగాణ‌ కు ఒకేసారి ఎన్నిక‌లు! `ముంద‌స్తు` కు జ‌గ‌న్‌?

ఐదు సంవత్సరాల పాటు మీటర్ల నిర్వహణ డిస్కమ్‌లు చేయ‌డానికి ఒక్కో మీటర్‌కు ₹6,000 మరియు అదనంగా ₹29,000 మంజూరు చేయబడుతుంది. అందరికీ ఉచితంగా మీటర్లు బిగించడాని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ వేగంగా ముందుకు క‌దులుతోంది. ఇదంతా రైతుల సెంటిమెంట్ అంశంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చెబుతున్నారు. ప‌లు సందర్భాల్లో ఏపీలో మీట‌ర్ల బిగించ‌డంపై తెలంగాణ నేత‌లు సెటైర్లు వేశారు. కేంద్ర ప్ర‌భుత్వానికి గులాముగా మారిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్మార్ట్ మీట‌ర్ల‌ను బిగిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు చేస్తూ, తెలంగాణ‌లో మీట‌ర్ల‌ను పెట్ట‌బోమ‌ని కేసీఆర్ తేల్చి చెప్పారు.

ఒకప్పుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు హార్స్ ప‌వ‌ర్ 50 పైస‌ల‌కు విద్యుత్ ను రైతులకు అందించారు. ఆ త‌రువాత ఉచిత విద్యుత్ నినాదం అన్ని పార్టీలు అనుస‌రించాయి. కానీ, స‌ర‌ఫ‌రా మాత్రం ఉండేది కాదు. అయితే, వైఎస్సాఆర్ సీఎంగా ఉండ‌గా ఏడు గంట‌ల ఉచిత విద్యుత్ ఇచ్చారు. అందుకే, ఆయ‌న రెండోసారి 2009 ఎన్నిక‌ల్లో సీఎం కాగ‌లిగార‌ని కాంగ్రెస్ ఇప్ప‌టికీ భావిస్తోంది. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం స్మార్ట్ మీట‌ర్ల ద్వారా రైతుల విద్యుత్ వినియోగానికి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉచితంగా మీట‌ర్లు బిగిస్తున్న‌ప్ప‌టికీ రాబోవు రోజుల్లో ఛార్జీలు వ‌సూలు చేస్తార‌న్న భ‌యం , అనుమానం రైతుల‌ను వెంటాడుతోంది. రైతుల్లో ఉన్న అనుమానం పెనుభూతంగా మారి 2024 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలుపును తారుమారు చేసే అవ‌కాశం లేక‌పోలేదు.

Also Read:  AP Minister: మంత్రి ఉషశ్రీ చరణ్‌ కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌