Site icon HashtagU Telugu

AP Electricity Scam: ఏపీలో 8వేల కోట్ల ప‌వ‌ర్ `కుంభ‌కోణం`?

Ap Hikes Power Tariff

Ap Hikes Power Tariff

కేంద్రానికి అడుగులు మ‌డుగులొత్తుతోన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని దామోద‌రం సంజీవ‌య్య ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్ ను ప్రైవేటుకు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. అక్క‌డి మూడు యూనిట్ల‌ను ప్రైవేటు వ్య‌క్తుల‌కు అప్ప‌గించ‌డానికి ఫైల్ క‌దిలింది. టెండర్ల ద్వారా చ‌క‌చ‌కా ప్రైవేటుకు ఇవ్వ‌డానికి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.

ఒక వైపు వ్య‌వ‌సాయ పంపు సెట్ల‌కు మీట‌ర్ల‌ను బిగిస్తూ వేగంగా ముందుకెళుతోన్న జగన్ మోహన్ రెడ్డి స‌ర్కార్ భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లో కేవ‌లం ₹13,500/- ల‌కు అయ్యే మీట‌ర్ల బిగింపు ఖ‌ర్చును ₹35,000/- గా ఏపీ ప్ర‌భుత్వం చూపిస్తోంద‌ని గ‌త కొన్ని రోజులుగా ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటోంది. వాటిని ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా తాజాగా నెల్లూరులోని ప‌వ‌ర్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్ప‌గించ‌డానికి స‌న్న‌ద్ధం అయింది. ఇదంతా కేంద్ర ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌న‌లో జ‌రుగుతోంది.

Also Read:  Chandrababu Naidu: సింహానికి రాజ‌కీయ బోను

వాస్త‌వంగా ఏపీ-జెన్‌కో యూనిట్‌కు ₹4.64/- ఖర్చుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. కానీ, ప్రైవేట్‌ కంపెనీల నుంచి యూనిట్‌కు ₹21/-ల‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తోంది. ఎపీ జెన్ కో ప‌రిధిలోని దామోద‌ర సంజీవ‌య్య ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ దేశంలోనే అత్యుత్త‌మైన‌ది. ప‌లు అవార్డులు, రివార్డుల‌ను అందుకున్న ప్లాంట్‌. అలాంటి ప్లాంట్ ను ప్రైవేటు అప్ప‌గించ‌డానికి సిద్ధం కావ‌డం గ‌మ‌నార్హం. వారం క్రితం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన‌ 800MW ప్లాంట్‌తో సహా మొత్తం మూడు యూనిట్ల నిర్వహణ, ఇత‌ర కార్య‌క‌లాపాల‌ను ప్రైవేటుకు అప్ప‌గించ‌డానికి దూకుడుగా ఏపీ ప్ర‌భుత్వం వెళుతోంది. దానికి ప్ర‌ధాన కార‌ణం న‌ష్టాల్లో ఉంద‌ని అంద‌మైన అబ‌ద్దం చెబుతున్నారు.

త‌క్కువ ధ‌ర‌కు విద్యుత్ ను ఉత్ప‌త్తి చేస్తోన్న జెన్ కో ప‌రిధిలోని ప్లాంట్ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ ప్రైవేటు కంపెనీల నుంచి అత్య‌ధిక ధ‌ర‌కు ప‌వ‌ర్ ను కొనుగోలు చేయ‌డం ప్ర‌భుత్వానికి అల‌వాటుగా మారింది. వాస్త‌వంగా SDSTPS కి 30,000 మిలియన్ యూనిట్లకు ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 16,430 మిలియన్ యూనిట్లకు ప‌రిమితం చేసింది. SDSTPS విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎందుకు తక్కువగా ఉపయోగించుకుంటున్నారు అనేది పెద్ద ప్ర‌శ్న‌.

Also Read:   Amaravathi Farmers : అమ‌రావ‌తి రైతుల `త్యాగం`కు జ‌గ‌న్ గొళ్లెం!

క్ర‌మేణ మొత్తం ప్రాజెక్టు ప్రైవేటు చేతుల్లోకి వెళుతుంద‌ని అక్క‌డి ఉద్యోగుల ఆందోళ‌న‌. పైగా 300 మంది ఉద్యోగుల భ‌ద్ర‌త గురించి ఆలోచించ‌కుండా ప్రైవేటు దిశ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ప‌రుగుపెడుతోంది. ధ‌ర్మ‌ల్‌ యూనిట్లు అవుట్‌సోర్సింగ్ కు వెళ్లే దిశ‌గా ఫైల్ క‌దులుతోంది. సుమారు రూ. 8వేల కోట్ల మేర‌కు ప్రైవేటు కంపెనీకి లాభం చేకూర్చే నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని విద్యుత్ ఉద్యోగుల సంఘం నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఇంధ‌నం, నిర్వ‌హ‌ణ‌, ఆప‌రేష‌న్ ను అప్ప‌గించ‌డం ఏపీ స‌ర్కార్ చేస్తోన్న త‌ప్పుగా వాళ్లు చెబుతున్నారు.

ప్రభుత్వ రంగ యూనిట్‌ను ప్రయివేటు కంపెనీలకు అప్పగించడం వల్ల దీర్ఘకాలంలో విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగి ఛార్జీలు భరించలేని స్థాయికి వెళ‌తాయ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. విదేశాల‌ నుంచి నాసిరకం బొగ్గును ప్రైవేట్‌ సంస్థ ద్వారా దిగుమతి చేసుకోవడంపై విచారణ జరిపించాలని సీఐటీయూ నేత డిమాండ్‌ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ రైతులు , ఇతర బలహీన వర్గాల ప్రజలు అనుభవిస్తున్న రాయితీని కోల్పోతార‌ని అన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాల వ‌ల‌న‌ ఏపీ-జెన్‌కో, డిస్కమ్‌లు నష్టపోయాయని, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులు భారీ లాభాలు గ‌డిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

Also Read:   Amaravathi: అమ‌రావ‌తి పై `సుప్రీం` చీఫ్ ల‌లిత్ కీల‌క నిర్ణ‌యం