Governor Abdul Naseer : మాది పేదల పక్షపాత ప్రభుత్వం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Session) ప్రారంభం అయ్యాయి. శాసనసభ, మండలిని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Naseer) ప్రసంగిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. మాది పేదల ప్రభుత్వమని, నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. దీంతో అణగారిన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు లబ్ధి పొందాయని ఆయన అన్నారు. పేదరికం […]

Published By: HashtagU Telugu Desk
Governor Abdul Naseer

Governor Abdul Naseer

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Session) ప్రారంభం అయ్యాయి. శాసనసభ, మండలిని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Naseer) ప్రసంగిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. మాది పేదల ప్రభుత్వమని, నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. దీంతో అణగారిన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు లబ్ధి పొందాయని ఆయన అన్నారు. పేదరికం 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గిందని, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నామని అని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలను తమ ప్రభుత్వం చేపట్టిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ను అందిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 1వ తరగతికి IB విధానం అమలు చేస్తామన్నారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుస్తామని, విద్యారంగంపై రూ. 73వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. 1-10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అందిస్తున్నామని, ఇందుకు ఏటా రూ.1910 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని గవర్నర్‌ అబ్దుల్‌ పేర్కొన్నారు. సామాజిక న్యాయం.. సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. విజయవాడలో ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడమే అని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు రేపటికి (మంగళవారం) వాయిదా పడే అవకాశం ఉంది. మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి బుధవారం (ఫిబ్రవరి 7) ఉదయం 11 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సమావేశం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. అయితే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది.

Read Also : Uniform Civil Code Bill: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సిద్ధం

  Last Updated: 05 Feb 2024, 11:00 AM IST