AP Govt: క్రైస్త‌వుల‌కు జ‌గ‌న్ వ‌రం, చ‌ర్చిల నిర్మాణం వేగం

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అత్యంత వివాద‌స్ప‌ద‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. మునుపెన్న‌డూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియ‌న్ చ‌ర్చిల అభివృద్ధి కోసం భారీగా నిధుల‌ను కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - November 18, 2022 / 12:58 PM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అత్యంత వివాద‌స్ప‌ద‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. మునుపెన్న‌డూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియ‌న్ చ‌ర్చిల అభివృద్ధి కోసం భారీగా నిధుల‌ను కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ మేర‌కు ప్ర‌భుత్వం రూ.175 కోట్ల‌ను విడుద‌ల చేస్తూ జీవో జారీ చేసింది.

ఏపీ వ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నిధుల‌ను స‌మానంగా కేటాయించింది. ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున అందించనుంది. జిల్లా కేంద్రాలకు మరో కోటి చొప్పున అదనంగా మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో వినిపిప్తోంది.

క్రైస్తవుల శ్మశానాల ఆధునికీకరణకు కూడా ఈ నిధులను వెచ్చించాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 19వ తేదీలోగా ప్రతిపాదనలను అందించాలని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులను జారీ చేస్తున్నారు. ఇమాంలు, ఫాస్ట‌ర్ల‌కు గౌర‌వ వేత‌నం ఇస్తోన్న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్ర‌త్యేకంగా ప్రార్థ‌నా మందిరాల‌కు నిధుల‌ను కేటాయించ‌డం వివాద‌స్ప‌దం అవుతోంది.

చ‌ర్చిల‌కు రూ. 175 కోట్లు విడుద‌ల‌పై బీజేపీ ఫైర్‌
ఏపీలో చర్చిల నిర్మాణం, అభివృద్ధి కోసం నిధుల విడుద‌ల‌పై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. ప్ర‌జా ధ‌నాన్ని చ‌ర్చిల కోసం ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. రూ. 175 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయ‌డంపై న్యాయ‌స్థానంలో పోరాడుతామ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గానికి కోటి చొప్పున ప్రార్థ‌నా మందిరాల నిర్మాణం కోసం జ‌గ‌న్ స‌ర్కార్ నిధుల‌ను విడుద‌ల చేయ‌డంపై బీజేపీ ఫైర్ అవుతోంది.