Conversion: ఏపీలో ‘స్వ‌చ్చంధ’ క్రైస్త‌వం

ఏపీలో జోరుగా మ‌త మార్పిడులు జ‌రుగుతున్నాయ‌ని కేంద్రం గుర్తించింది. క్రిస్టియ‌న్ మ‌తాన్ని స్వీక‌రించ‌డానికి కొన్ని స్వ‌చ్చంధ సంస్థ‌ల రూపంలో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. మ‌త మార్పిడుల‌ను స్వ‌చ్చంధ సంస్థ‌లు ప్రోత్సాహించ‌డంపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి.

  • Written By:
  • Updated On - December 22, 2021 / 04:08 PM IST

ఏపీలో జోరుగా మ‌త మార్పిడులు జ‌రుగుతున్నాయ‌ని కేంద్రం గుర్తించింది. క్రిస్టియ‌న్ మ‌తాన్ని స్వీక‌రించ‌డానికి కొన్ని స్వ‌చ్చంధ సంస్థ‌ల రూపంలో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. మ‌త మార్పిడుల‌ను స్వ‌చ్చంధ సంస్థ‌లు ప్రోత్సాహించ‌డంపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. వాటి మీద విచార‌ణ చేస్తున్న‌ట్టు పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్ర మంత్రి నిత్యానంద వెల్ల‌డించాడు.ఫారిన్ ఫండ్స్ పొందుతోన్న కొన్ని సంస్థ‌లు మ‌త మార్పిడుల‌కు పాల్ప‌డుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఏపీలోని 18 స్వ‌చ్చంధ సంస్థ‌లు మ‌త మార్పిడుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు ప్రాథ‌మిక ఆధారాలను కేంద్రానికి కొంద‌రు అంద‌చేశారు. ఏపీలోని 18 ఎఫ్‌సిఆర్‌ఎ గుర్తింపు పొందిన ఎన్‌జిఓలు 2018 నుంచి క్రైస్తవ మతంలోకి ప్ర‌జ‌ల్ని మార్చుతున్నాయ‌ని ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్టు రాయ్ చెప్పాడు.

ఫారిన్ కంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FCRA), 2010, ప్ర‌కారం స్వ‌చ్చంధ సంస్థ‌లు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాలి. వాటిని ధిక్కరించిన సంస్థ‌లు చట్టపరమైన చ‌ర్య‌ల‌ను ఎదుర్కొవాలి. NGO యొక్క ఖాతాల ఆడిట్, వారి ఖాతాలు ,రికార్డుల తనిఖీ , ఆన్-ఫీల్డ్ యొక్క ధృవీకరణ త‌దిత‌రాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు రాయ్ లోక్ స‌భ‌లో వెల్ల‌డించాడు.క్రైస్త‌వ మ‌తంలోకి ప్ర‌జ‌ల్ని మార్చుతోన్న 18 NGOల యొక్క FCRA సర్టిఫికేట్ సస్పెండ్ చేయడానికి అధికారులు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి చెప్పాడు. ఎఫ్‌సిఆర్‌ఎను ఉల్లంఘించిన కొన్ని సందర్భాల్లో వారెంట్ ఉన్నట్లయితే, ఎఫ్‌సిఆర్‌ఎలోని వివిధ సెక్షన్ల కింద విచార‌ణ జ‌రుపుతామ‌ని వివ‌రించాడు. మొత్తం మీద చాలా కాలంగా ఏపీలో జ‌రుగుతోన్న మ‌త మార్పిడుల వ్య‌వ‌హారం మీద కేంద్రం దృష్టి పెట్టింది. విచార‌ణ చేస్తోన్న క్ర‌మంలో 18 ఎన్ జీవోల పై వేటు ప‌డే ఛాన్స్ ఉంది.