Gorantla Issue: గోరంట్ల బూతు వీడియో పై ‘నార్త్’ ఫైట్

ఫేక్ వీడియో గా ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్నప్పటికీ ఒరిజినల్ వీడియో ఎక్కడ? అనే ప్రశ్న వస్తుంది.

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 10:05 AM IST

ఫేక్ వీడియో గా ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్నప్పటికీ ఒరిజినల్ వీడియో ఎక్కడ? అనే ప్రశ్న వస్తుంది. అందుకే ఏపీ పోలీసుల విచారణ ను ప్రత్యర్థులు అనుమానిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఆ వీడియో సంగతి తేల్చాలని టీడీపీ తో పాటుగా ప్రజాసంఘాలు ఢిల్లీ బాట పట్టాయి. ఫోరెన్సిక్ ల్యాబుకు పంపాలని గోరంట్ల, పంపడానికి ఒరిజినల్ వీడియో లేదనిఅనంతపురం ఎస్పీ, ఫోరెన్సిక్ కు పంపామని హోంమంత్రి వనిత చెప్పడం ఏపీ ప్రభుత్వం దొంగాట అర్థం అవుతుంది. ఆ క్రమంలో జాతీయ మహిళ కమిషన్, ప్రధాని కార్యాలయం కు వీడియోను పంపించాలని ప్రత్యర్థులు నిర్ణయించారు.
యూకే నుంచి తొలుత వీడియోను టీడీపికి చెందిన గ్రూపులో తొలుత పోస్టు చేసారని ఎస్పీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఎంపీ జస్బీర్‌ సింగ్‌ గిల్‌ తన లేఖలో నైతికతను వదిలేసి వ్యవహరించిన తీరుతో షాక్ అయినట్లుగా పేర్కొన్నారు. పార్లమెంటు గౌరవానికి, ప్రతిష్ఠకు కళంకం తీసుకొచ్చారంటూ ఆరోపించారు. ఇది క్రిమినల్ చర్యగా ఆయన ప్రధానికి రాసిన లేఖలో వివరిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. మాధవ్ వ్యవహారం పైన తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసారు.
గోరంట్ల మాధవ్ పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ జస్బీర్‌ సింగ్‌ గిల్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. మాధవ్ కు సంబంధించింది అంటూ ఒక వీడియో వైరల్ అయింది. అయిదే, దీని పైన ఇప్పటికే అనంతపురం ఎస్పీ స్పష్టత ఇచ్చారు. అసలైన వీడియో బయటకు వస్తేనే దానిని ఫోరెన్సిక్ కు పంపగలుగుతామని చెప్పారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ తో షూట్ చేసిందిగా నిర్దారించారు. మొత్తం మీద గోరంట్ల బూతు వీడియో పై రాష్ట్రానికి చెందిన పార్టీల కంటే ఉత్తర భారత లీడర్లు అభ్యంతర పెడుతున్నారు. నార్త్ లీడర్ల ఫైట్ ను తెర వెనుక టీడీపీకి చెందిన ఒక కీలక లీడర్ నడుపుతున్నారని వైసీపీ అనుమానం. మొత్తం మీద గోరంట్ల వీడియో దేశ రాజధానికి చేరింది. ఇప్పుడైనా ఒరిజినల్ వీడియో బయటకు వస్తే ఏపీ పోలీస్ స్పందిస్తారే మో చూడాలి.