Gorantla Madhav : గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్‌

అంతకు ముందు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించారు. ఆయనతో సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం ఆరుగురికి రిమాండ్‌ విధించింది. గోరంట్ల మాధవ్ ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Gorantla Madhav remanded for 14 days

Gorantla Madhav remanded for 14 days

Gorantla Madhav : హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇటీవల న్యాయస్థానం విధించిన రెండు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన్ని గురువారం కోర్టులో హాజరుపరిచారు. అంతకు ముందు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించారు. ఆయనతో సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం ఆరుగురికి రిమాండ్‌ విధించింది. గోరంట్ల మాధవ్ ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

Read Also: India Vs Pak: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సంచలన నిర్ణయాలు

కాగా, చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు గుంటూరు తీసుకువస్తుండగా అతనిపై గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పోలీసు కార్యాలయంలో కూడా మరోసారి దాడికి యత్నించడంతో నగరంపాలెం పోలీసులు మాధవ్‌ను, ఆయన అనుచరులు ఐదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించగా తొలుత రాజమండ్రి జైలుకు తరలించారు. వారికి బెయిల్‌ కోరుతూ మాధవ్‌ తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మరో పిటిషన్‌ వేశారు. దీంతో విచారణ జరిపిన న్యాయమూర్తి.. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేశారు. గోరంట్ల మాధవ్‌ సహా ఐదుగురు నిందితులను బుధ, గురువారాల్లో రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. తాజాగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

Read Also: CM Chandrababu : పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికత : సీఎం చంద్రబాబు

 

 

  Last Updated: 24 Apr 2025, 06:38 PM IST