Gorantla Butchaiah : ముఖానికి బ్యాండేజ్‌లు వేసుకొని గోరంట్ల వినూత్న నిరసన..

ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని ముఖ్యమంత్రి జగన్ పై దాడిని హేళన చేస్తూ మీడియా ముందుకు వచ్చారు టిడిపి (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary). ఇవాళ ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని వినూత్న నిరసన తెలిపారు.

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 01:25 PM IST

ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని ముఖ్యమంత్రి జగన్ పై దాడిని హేళన చేస్తూ మీడియా ముందుకు వచ్చారు టిడిపి (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary). ఇవాళ ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి మాట్లాడుతూ.. బాబాయ్ ని చంపిన వాడిని ఈ ముఖ్యమంత్రి కాపాడుకుంటున్నాడని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటనలో కరెంటు తీసేయడం అంటే కుట్ర కనపడుతుందని, ముఖ్యమంత్రి కపటనాటకాలు ప్రజలకు తెలిసిపోయాయన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ముఖ్యమంత్రిపై రాయి విసరడం ముమ్మాటికి తప్పే అని ఆయన మండిపడ్డారు. కానీ ఈ సంఘటనను అవకాశం గా మరలుచుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసు యంత్రాంగం ఏమయింది గాడిదలు కాస్తుందా …? అని ఆయన ప్రశ్నించారు. ముందు డిజిపిని పోలీస్ కమిషనర్ను సస్పెండ్ చేయాలన్నారు. ప్రజలకు ఏం చేశావని నీకు సానుభూతి చూపాలని, ఇసుక మద్యం మాఫియాల ద్వారా లక్షల కోట్లు నీ తాడేపల్లి ప్యాలస్ కు చేరుకున్నాయన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాకుండా.. రాబోయే తరాలను తాకట్టుపెట్టి అధికారం నీకు ఎక్కడిదని, గడచిన 5 ఏళ్లలో దోచిన సొమ్మంతా నియోజకవర్గాలకు పంపించావన్నారు గోరంట్ల. తెలుగు ప్రజలకు పట్టిన గ్రహణం జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అని ఆయన ధ్వజమెత్తారు. మీ ఆటవిక, అరాచక పాలనకు చెక్ పెట్టే రోజు దగ్గరలో పడిందని, మద్యపాన నిషేధం చెప్పి నకిలీ మద్యానికి ప్రజలను బానిసలు చేశావన్నారు. గంజాయి ముత్తు పదార్థాలకు రాష్ట్రాన్ని కేంద్రంగా తీర్చిదిద్దామని, ముఖ్యమంత్రి మీద దాడి జరుగుతుందని సాక్షికి ముందుగానే ఎలా తెలిసింది….? అని ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో కరెంటు ఎందుకు తీసేసారు …? అని ఆయన వ్యాఖ్యానించారు.

మీ సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు అప్రమత్తం కాలేదు ….? చంద్రబాబును పట్టపగలు కాల్చేయాలని చెప్పింది నువ్వు కాదా …? ముఖ్యమంత్రి మీద దాడి జరిగిన వెంటనే ఆయనను ఎందుకు అక్కడ నుంచి పంపించలేదు..? అని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లకు ముందుగా డబ్బులు విడుదల చేశారు కానీ.. పింఛను దారులకు డబ్బులు విడుదల చేయలేదని, ముఖ్యమంత్రి సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఆయనకు ప్రజలు సానుభూతి చూపరన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Read Also : BRS vs Ex BRS : ఈ 4 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులతో మాజీ బీఆర్‌ఎస్ నేతలు పోటీ..!