మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan)పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary)తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. “ఖబడ్దార్ జగన్ రెడ్డి.. ఎవరి తలలు నరుకుతావు? ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతిభ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు” అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా జగన్ వ్యవహరిస్తున్నారని, రౌడీలు, గంజాయి మాఫియా, గుండాల సహాయంతో రాష్ట్రంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CP CV Anand: త్వరలో హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్..
గత ఐదేళ్లలో జగన్ ఒక నియంతలా పరిపాలించారని, ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కుల, మత, ప్రాంత భేదాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని అన్నారు. “దమ్ముంటే గత ఐదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?” అంటూ సవాలు విసిరారు. జగన్ గెలుస్తాడని బెట్టింగ్ పెట్టిన వ్యాపారవేత్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నా, ఏడాది తరువాత పరామర్శకు వెళ్లడం దారుణమని అన్నారు.
KTR : కేటీఆర్, జగదీశ్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
జగన్ పర్యటనలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మృతి చెందినప్పటికీ, ఆయన ఒక్క పరామర్శకైనా వెళ్లలేదన్న విమర్శలు చేశారు. జగన్ తీరును చూసి ప్రజలు విసుగెత్తిపోయారని, ఇకనైనా ఆయన కపట నాటకాలకు తెరదించాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రం ముందుకెళ్తుందన్న గోరంట్ల, జగన్ ప్రస్తుతం బయట తిరుగుతున్నదే ప్రజాస్వామ్యమే నిదర్శనమని స్పష్టం చేశారు. అయితే అదే ప్రజాస్వామ్యాన్ని మళ్లీ దుర్వినియోగం చేస్తే, రోడ్డెక్కే పరిస్థితి తప్పదని హెచ్చరించారు.