Gorantla: డ‌ర్టీ వీడియో`నిజ‌మ‌ని తేల్చిన‌ అమెరికా ల్యాబ్

అమెరికా వ‌ర‌కు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ డ‌ర్టీ ఫిక్చ‌ర్ వెళ్లింది.

  • Written By:
  • Updated On - August 13, 2022 / 07:52 PM IST

అమెరికా వ‌ర‌కు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ డ‌ర్టీ ఫిక్చ‌ర్ వెళ్లింది. అక్క‌డి ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ వీడియో మార్ఫింగ్ కాద‌ని, రియ‌ల్ అంటూ తేల్చింది. ఆ రిపోర్టును టీడీపీ నేత‌లు శ‌నివారం బ‌య‌ట‌పెట్టారు. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ ఆ వీడియోను పరిశీలించింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇందులో పలు అంశాల్ని ల్యాబ్ ప్రస్తావించింది. ఎస్పీ ఫకీరప్ప చెప్పిన విషయాలకు భిన్నంగా ఈ నివేదిక వచ్చింది. దీంతో ఆ నివేదిక‌ను టీడీపీ వైరల్ చేసే పనిలో టీడీపీ ఉంది.

ఎక్లిప్స్ ల్యాబ్ కు ఆగస్టు 9న ఆ వీడియో వచ్చిందని తెలిపింది. పోతిని అనే వ్యక్తి పరీక్షల కోసం పంపారని వెల్లడించింది. ఇది మార్ఫింగ్ చేశారా లేక ఒరిజినలేనా? తేల్చాలని కోరినట్లు తెలిపింది. ఎస్పీ ఫకీరప్ప చెప్పినట్లుగానే ఈ వీడియో ఫోన్ లో రికార్డ్ చేశారని తేల్చారు. రికార్డ్ చేసిన ఈ వీడియో నిజమేనని, ఎడిట్ చేసింది కాదని తెలిపింది.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించి వైరల్ అవుతున్న నగ్న వీడియో రియల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించిన నేపథ్యంలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇది నిజమా కాదా తేల్చాల్సింది ఫోరెన్సిక్ నిపుణులకు భిన్నంగా పోలీసులు ఎలా తేలుస్తారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ డీజీపీతో పాటు లోక్ సభ స్పీకర్ ను కోర‌డం జ‌రిగింది. తాజాగా రియల్ గా నిర్ధారించేలా అమెరికా ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటికి వచ్చింది.