Rajahmundry : రాజ‌మండ్రి స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు

రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు త‌ప్పింది. దీంతో ఆ రూట్‌లో వెళ్ల‌నున్న...

  • Written By:
  • Publish Date - November 9, 2022 / 10:35 AM IST

రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు త‌ప్పింది. దీంతో ఆ రూట్‌లో వెళ్ల‌నున్న తోమ్మిది రైళ్ల‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ర‌ద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రాజమండ్రి యార్డు మెయిన్ లైన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనతో రైల్వే అధికారులు ఒక ట్రాక్‌పై రైళ్ల రాకపోకలను అనుమతించారు. దీంతో తొమ్మిది రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, ఒక రైలును రీషెడ్యూల్ చేశారు. విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-విజయవాడ, గుంటూరు-విశాఖపట్నం, విశాఖపట్నం-గుంటూరు, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రద్దు చేయబడ్డాయి. కాకినాడ టౌన్-విజయవాడ మధ్య కాకినాడ పోర్ట్-విజయవాడ రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ-రాజమండ్రి రైలు తాడేపల్లిగూడెం-రాజమండ్రి మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది. విజయవాడ-లింగంపల్లి రైలును రెండు గంటలు రీషెడ్యూల్ చేశారు.