విజయనగరం జిల్లా (Vijayanagaram District) ఎస్.కోట మండలం బొడ్డవర వద్ద గూడ్స్ రైలు (Goods train) పట్టాలు తప్పింది. ఇనుప ఖనిజంతో కిరండోల్ నుంచి విశాఖ వస్తుండగా గూడ్స్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలంకు చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ సత్పతి ఆధ్వర్యంలో పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన కారణంగా ఆదివారం విశాఖ పట్టణం నుండి బయలుదేరే రైలు కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ ను రైల్వే అధికారులు రద్దు చేశారు. కిరండోల్ – విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్ కోరాపుట్, రాయగడ మీదుగా విశాఖ చేరుకుంటుందని రైల్వే శాఖ తెలిపింది. విశాఖ – కిరండోల్ ఎక్స్ ప్రెస్ ప్రతిరోజూ రాత్రి విశాఖ నుంచి బయలుదేరుతుంది. అరకు, కోరాపుట్, దంతేశ్వర మీదుగా కిరండోల్‌కు చేరుకుంటుంది. మొత్తం 472 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.12 స్టేషన్‌లలో రైలు ఆగుతుంది.
ఒడిశాలో రెండు వారాల క్రితం ఘోర రైలు ప్రమాదం సంభవించిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో సుమారు 280 మందికిపైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఇంకా అనేకమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒడిశాలో ఘోర ప్రమాదం తరువాత రైలు పట్టాలు తప్పిన ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఒడిశా ప్రమాదం నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైలు ప్రమాదాలు చోటుచేసుకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.
G20 Tourism Meet : జీ-20 టూరిజం సమావేశాలకు సిద్ధమైన గోవా.. ప్రధాన చర్చ ఆ సమస్యలపైనే ..