Site icon HashtagU Telugu

Good News : ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త..కాకపోతే

Construction Permits In Ap

Construction Permits In Ap

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) పౌర సేవలను వేగవంతం చేయడమే కాకుండా, సామాన్య ప్రజలకు ఇంటి నిర్మాణ అనుమతులు పొందడాన్ని మరింత సులభతరం చేసేందుకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రారంభించిన స్వీయ ధ్రువీకరణ (Self-Certification) పథకం ద్వారా ఇకపై ఇంటి అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.

ఈ పథకం ప్రకారం.. ఇంటి నిర్మాణం చేపట్టదలచిన వారు మొదటగా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఖాళీ స్థల ఫోటోలు, పన్ను రశీదు వంటి వివరాలను లైసెన్స్ పొందిన సాంకేతిక నిపుణులు (LTPలు) కి సమర్పించాలి. ఆ నిపుణులు డాక్యుమెంట్లను పరిశీలించి, అవసరమైన ఫీజును చెల్లించి, ఇంటి ప్లాన్ తయారుచేసి డిపిఎంఎస్ (DPMS – Development Permission Management System) పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. అటు వెంటనే ఇంటి అనుమతి ప్రొసీడింగ్ కాపీను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించవచ్చు.

BJP Fire Brand : ఇక బీజేపీలో ఫైర్ బ్రాండ్ ఆమెనే..రాజాసింగ్ ను మరచిపోవాల్సిందేనా..?

ఈ విధానం వల్ల ప్రజలకు సమయాన్ని, ఖర్చును ఆదా చేయడంతో పాటు అనవసర అవినీతి పరిస్థితుల నుంచి బయటపడటానికి ఇది పెద్ద అవకాశం. అయితే, దీనితో పాటు ప్రభుత్వం కఠిన నిబంధనలను కూడా అమలు చేసింది. ఎవరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, వారికి నోటీసులు జారీ చేసి అనుమతులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎల్టీపీలు తప్పుడు పత్రాలు సమర్పించి అనుమతి పొందితే వారి లైసెన్సును ఐదేళ్లపాటు రద్దు చేస్తామని కూడా స్పష్టంగా తెలిపారు.

ప్రతి ఇంటి నిర్మాణం తప్పనిసరిగా ప్రభుత్వ నియమాల ప్రకారమే ఉండాలి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులూ ఎల్టీపీ నివేదికల ఆధారంగా నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తారు. ఖాళీ స్థలాలు వదలకపోవడం, అనుమతి లేకుండా అదనపు అంతస్తులు వేసేలా నిర్మించడం లాంటి చర్యలు చేస్తే, సంబంధిత అనుమతులు రద్దవుతాయి. ఇలా ప్రభుత్వ విధానం ప్రకారం నిబంధనలు పాటిస్తే ఇంటిని సులభంగా నిర్మించుకోవచ్చు. కాని అతిక్రమిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.