ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు చికెన్, మటన్ ధరలు పెరిగిపోయాయి. ఒకొక్కసారి చికెన్ ధరలు తగ్గినా మటన్ ధరలు మాత్రం ఎప్పుడూ తగ్గే పరిస్థితి లేదు. మటన్ కి ఎప్పుడూ విపరీతంగా డిమాండ్ ఉండటంతో ఏ రోజైనా అధికంగానే ధర ఉంటుంది. మార్కెట్ లో మటన్ ధర ఎప్పుడూ రూ. 600 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. వీకెండ్స్ లో మటన్ ధర మరింత పెరుగుతుంది. కానీ దీనికి భిన్నంగా ఒక చోట కిలో మటన్ రూ.50 కే దొరుకుతుంది. గత ఏడాది కరోనా వైరస్ ప్రారంభంలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.
కోళ్ల ద్వారా వైరస్ వస్తుందనే ప్రచారం జరగడంతో చికెన్ ధరలు పడిపోయాయి. ఆ సమయంలో మటన్ ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు అందంతా ఫేక్ అని తెలిపోయింది. అయినప్పటికీ కిలో మటన్ రూ.50 కి ఇప్పుడు దొరుకుతుందంటే మాసం ప్రియులకు పండుగే అని చెప్పాలి. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్లీ రాదని ఎగబడి మరీ కొనేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా చూసిన మటన్ ధర కిలో రూ.800 రూపాయలు ఉండగా అక్కడ మాత్రం రూ.50 కే ఎందకు దొరుకుతుందంటే దానికి అక్కడి వ్యాపారస్తుల మధ్య పోటీనే ప్రధానా కారణంగా తెలుస్తోంది. ఇంతకీ 50 రూపాయలకే దొరుకుతున్న మటన్ ఎక్కడ అనుకుంటున్నారా.. చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురంలోని మటన్ షాపుల్లో ఈ బంపర్ ఆఫర్ నడుస్తుంది. ఇక్కడ వ్యాపారుల మధ్య పోటీతో కస్టమర్లు కావాల్సినదానికంటే.. ఎక్కువ మటన్ ఇళ్లకు తీసుకెళ్లారు. వ్యాపారుల పోటీతో కిలో 50 రూపాయలకు మటన్ అమ్ముతుండటంతో కస్టమర్లు పోటీ పడ్డారు. ఒక్కొక్కరు ఐదు నుంచి పదికిలోల వరకు పట్టుకెళ్లారు.
చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం గాంధీ బస్టాండు పక్కన చాలా మటన్ దుకాణాలు ఉన్నాయి. ఓ దుకాణం దారుడు తన దుకాణానికి ఎక్కువ మంది కస్టమర్లు రావాలని కిలో మటన్ రూ. 300 లకి అమ్మడం ప్రారంభించాడు. మటన్ రేటు చాలా తక్కువగా ఉండటంతో కస్టమర్లు ఆ దుకాణదారుడి షాపు వద్దకు క్యూ కట్టారు. దీంతో పక్క షాపుల వాళ్లు మా షాపులో ఇంకా తక్కువగా మటన్ ఇస్తామంటూ తగ్గించేశారు. చివరకు పోటీ పడి కిలో మటన్ రూ.50కి పడిపోయింది.