Site icon HashtagU Telugu

Jobs : నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్

Jobs

Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రగతిపై దృష్టి సారించింది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పెద్దపీట వేస్తూ, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న విద్యుత్ సంస్థల్లో నియామకాల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Divorce : మంచి మూడ్ లో ఉండగా..భర్త ఆలా చేస్తున్నాడని విడాకులు ఇచ్చిన స్టార్ హీరోయిన్

రాష్ట్రంలోని జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో వివిధ క్యాడర్లలో సుమారు 9,849 పోస్టులు ఖాళీగా ఉండగా, వాటిలో 75 శాతం పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెక్నికల్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీ కానున్నాయి. అలాగే సివిల్, ఎలక్ట్రికల్, టెలికం, ఐటి విభాగాల్లో కూడా నియామకాలు చేపడుతున్నారు. నాన్ టెక్నికల్ విభాగంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేషన్ & నిర్వహణ కేటగిరీలో జూనియర్ లైన్మెన్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

Krishna Janmashtami : ఈరోజు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యఫలం!

గత పదేళ్లుగా ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల విద్యుత్ సంస్థల్లో సిబ్బంది కొరత తీవ్రంగా మారింది. దీంతో కొందరు ఉద్యోగులు పదోన్నతులు పొందినప్పటికీ, పాత బాధ్యతలతో పాటు అదనపు పనిని నిర్వహించాల్సి వచ్చింది. ఫలితంగా పని ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా డిస్కంలలో సమస్య మరింతగా పెరగడంతో, ప్రభుత్వం నియామకాలు తప్పనిసరని గుర్తించింది. ఇప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.