ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఐఐటీ(Tirupati IIT )కి కేంద్ర ప్రభుత్వం (Central Govt) నుండి భారీ నిధుల మంజూరు జరిగింది. రూ.2,313 కోట్ల నిధులను విడుదల చేసినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలలో ఒకటైన ఈ ఐఐటీ అభివృద్ధికి ఇది ఓ కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విద్యాసంస్థకు శాశ్వత కాంపస్ నిర్మాణం ప్రారంభమైందని, ఇప్పుడు వచ్చిన నిధులతో పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేయనున్నారని తెలుస్తోంది.
Pakistan-India Ceasefire: మే 18 తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం?
ఈ నిధులతో సుమారు 12,000 మంది విద్యార్థులకు వసతి, తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఫ్యాకల్టీ హౌసింగ్ వంటి మౌలిక సదుపాయాలన్నీ సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించబడ్డాయని, త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. విద్యారంగానికి గల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనబడింది.
తిరుపతిలో ఐఐటీకి శాశ్వత క్యాంపస్ పూర్తి కావడం వల్ల దేశ వ్యాప్తంగా విద్యార్థులు అధునాతన సాంకేతిక విద్యను పొందే అవకాశాలు పెరగనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రక్రియ ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి ఐఐటీకి భారీ నిధులు విడుదల కావడం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ పరిశ్రమలలో ఆనందాన్ని కలిగించింది.