Site icon HashtagU Telugu

Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్‌లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!

Ap Govt

Ap Govt

వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నేరుగా పది, ఇంటర్ చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. గడువు ముగిసినా రూ. 600 అదనపు ఫీజుతో డిసెంబర్ 6 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ కార్యక్రమంలో చేరితే ఉచిత పుస్తకాలు ఇస్తారు. యూట్యూబ్, వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వివిధ అన్ని బోర్డులతో సమానమైన గుర్తింపు గల సర్టిఫికెట్లను సార్వత్రిక విద్యాపీఠం అందిస్తు్ంది.

అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు మానేయాల్సి వస్తుంది. చదువుకోవాలని కోరిక ఉన్నా సాధ్యం కాలేక విద్యకు దూరమైన వారు చాల మంది ఉన్నారు. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. చదువుకు దూరమైన వారు మళ్లీ చదువుకునేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా.. నేరుగా పదో తరగతి, ఇంటర్‌లో చేరే అవకాశాన్ని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) ద్వారా కల్పిస్తోంది. అయితే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 15వ తేదీతో సమయం ముగిసిపోయినా.. ఈ ఓపెన్ స్కూల్ కార్యక్రమంపై చాలా మంది ఆశక్తి చూపుటుండటంతో.. రూ. 600 అదనపు ఫీజుతో డిసెంబర్ 6 వరకు గడువు పొడగించారు. మళ్లీ విద్యనభ్యసించాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

నేరుగా పదో తరగతిలో జాయిన్ కావాలనుకునేవారికి 14 ఏళ్లు నిండి ఉండాలి. అంతేకాకుండా చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అలాంటి వారు నేరుగా పదో తరగతిలో చేరవచ్చు. సెలవు రోజుల్లో పదో తరగతి శిక్షణ తీసుకుని పరీక్షలు రాయవచ్చు. అంతేకాకుండా పదో తరగతి పాస్ అయ్యి.. ఇంటర్ కాలేజీలో చేరకుండా ఉండిపోయిన వారు.. కాలేజీలో చేసి వివిధ కారణాల వల్ల మధ్యలో మానేసిన వారు నేరుగా ఇంటర్‌లో చేరవచ్చు. ఇంటర్‌లో చేరబోయే వారికి 15 ఏళ్లు నిండి ఉండాలి. నచ్చిన సబ్జెక్టు ఎంచుకొని సెలవు రోజుల్లో తరగతులకు హాజరై పరీక్షలు రాయవచ్చు.

కాగా, గతంలో పది, ఇంటర్‌ ఫెయిల్ అయిన వారు.. పాసైన రెండు సబ్జెక్టుల మార్కులను ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు బదిలీ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా గతేడాది నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో.. ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులు.. ఆ సబ్జెక్టును మాత్రమే తిరిగి రాస్తే సరిపోతుంది. ఈ మేరకు సార్వత్రిక విద్యాపీఠం అవకాశం కల్పించింది.

దరఖాస్తు చేసుకుని పదో తరగతి, ఇంటర్‌లో జాయిన్ అయిన వారికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు, సులభంగా ఉండే స్వీయ అభ్యసన సామాగ్రిని విద్యార్థుల ఇంటికే పంపిస్తారు. జ్ఞానధార యూట్యూబ్‌ ఛానల్, ఓపెన్‌ స్కూల్‌ వెబ్‌సైట్ల ద్వారా.. పాఠాలు నేర్చుకోవచ్చు. పరీక్షలు ఎలా జరుగుతాయి, మోడల్ పేపర్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్‌కు అంతగా గుర్తింపు ఉండదనుకుంటే పొరపాటే. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం పరీక్ష అందించే సర్టిఫికెట్లకు.. అన్ని రాష్ట్రాల బోర్డులు అందించే ధ్రువపత్రాలతో సమానంగా గుర్తింపు ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికులకు ఎంట్రీ ఫీజులో రాయితీ ఇస్తారు. ప్రభుత్వం కల్పించిన చక్కటి అవకాశాన్ని అవసరం అయిన వారు సద్వినియోగం అధికారులు చెబుతున్నారు.

Exit mobile version