తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) ఘనంగా ముగిసాయి. గత ఏడాది కంటే ఏడాది ఎంతో ఘనంగా పండగను జరుపుకున్నారు. వారం రోజుల పాటు సొంత ఊర్లలో ప్రజలు ఎంతో ఉత్సహంగా పండగను జరుపుకొని , ఇప్పుడు మళ్లీ పట్నం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగొస్తున్న వారికోసం ప్రత్యే్క రైళ్లు (Special Trains) సిద్ధం చేసింది. మొత్తం 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Champions Trophy Squad: నేడు ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించనున్న బీసీసీఐ!
జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈరోజు( జనవరి 18న) కాకినాడ నుంచి చర్లపల్లికి ఒక రైలు, విశాఖపట్నం నుంచి 2 ప్రత్యేక రైళ్లు చర్లపల్లికి స్టార్ట్ అవుతాయని తెలిపారు. అదే విధంగా జనవరి 19న విశాఖపట్నం, నరసాపురం నుంచి మరో 2 రైళ్లు చర్లపల్లి బయలుదేరతాయి. అదేరోజు చర్లపల్లి నుంచి భువనేశ్వర్‌కు ఒకటి, విశాఖపట్నానికి ఒకటి చొప్పున 2 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి జనవరి 20వ తేదీన మరో ప్రత్యేక రైలు ఉందని సీపీఆర్వో సీహెచ్ శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక రైళ్ళను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా లో కూడా ఈ ప్రత్యేక రైళ్ల గురించి ప్రచారం చేస్తుంది.