ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) రాష్ట్ర ప్రజలకు మరో మేలు చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ(New ration card application process)ను ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసిన తర్వాత ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలో మూడు దశల్లో పరిశీలన జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తిచేయడానికి సుమారు 21 రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. ఇక, దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. vswsonline.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, కోడ్ నమోదు చేయడంతో దరఖాస్తు ప్రస్తుతం ఏ అధికారితో ఉందో తెలుసుకోవచ్చు.
Pakistan-India Ceasefire: మే 18 తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం?
రేషన్ కార్డుల పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ఉచితంగా అందజేస్తుంది. ఇప్పటికే కార్డు ఉన్నవారికి కూడా స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకారం.. పిల్లలు (ఒక సంవత్సరం లోపు), 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈకేవైసీ నుంచి మినహాయింపు పొందుతారు. ఇప్పటి వరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారు. అలాగే పెళ్లి కాకుండా 50 ఏళ్లు దాటి ఒంటరిగా ఉన్నవారికి, లింగమార్పిడి చేసిన వారికి కూడా తొలిసారిగా రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు.
రేషన్ కార్డు సేవలు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ‘మనమిత్ర’ (95523 00009) ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో రేషన్ కార్డు జారీ, విడిపోవడం, చిరునామా మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డు సరిచూడటం లేదా సమర్పణ వంటి సేవలు పొందవచ్చు. పెళ్లైన వారు కొత్తగా కార్డు పొందడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలతో రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.