సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు

Special Trains For Sankranti 2026 సంక్రాంతి పండుగ సందడితో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి రద్దీ పెరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఛైర్ కార్, జనరల్ బోగీలతో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల వల్ల ప్రయాణికులకు కొంత మేర ఊరట కలుగుతుందని […]

Published By: HashtagU Telugu Desk
Special Trains For Sankranti 2026

Special Trains For Sankranti 2026

Special Trains For Sankranti 2026 సంక్రాంతి పండుగ సందడితో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి రద్దీ పెరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఛైర్ కార్, జనరల్ బోగీలతో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల వల్ల ప్రయాణికులకు కొంత మేర ఊరట కలుగుతుందని భావిస్తున్నారు.

  • రైల్వే శాఖ శుభవార్త
  • హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు
  • జవనరి 11 నుంచి 19 వరకు

హైదరాబాద్‌లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో అయిన వారితో కలిసి పెద్ద పండుగ చేసుకోవడం కోసం నగరవాసులు ఇంటి బాట పట్టారు. శనివారం నుంచి స్కూల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో.. ఇవాళ ఉదయం నుంచే ప్రయాణాలు జోరందుకున్నాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే రద్దీగా మారింది. ఇవాళ ఉదయం నుంచే ఈ రోడ్డు మీద ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద కి.మీ. మేర వాహనాలు బారులు తీరాయి. ఇదిలా ఉంటే సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడుస్తాయని తెలిపింది. ఈ రైళ్లు సంక్రాంతి పండుగ ముందు నుంచి.. ఆ తర్వాత రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది.

హైదరాబాద్ నుండి విజయవాడ కు ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు ఉదయం 6.10 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి. అలాగే, విజయవాడ నుండి హైదరాబాద్‌కు ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక రైళ్లు ప్రతి రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రయాణం ప్రారంభిస్తాయి.

ఛైర్ కార్ బోగీలకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉంది. రిజర్వేషన్ చేసుకోని ప్రయాణికుల కోసం, ఈ ప్రత్యేక రైళ్లలో సగానికి పైగా జనరల్ బోగీలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైళ్ల వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయాణికులకు ఊరట లభించనుంది.

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రైల్వే ఇప్పటికే 150కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. తాజాగా అదనంగా మరో 10 రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే ఇవి కేవలం విజయవాడ వరకు మాత్రమే వెళ్తాయి. కానీ ఇప్పటికే నడుస్తోన్న ప్రత్యేక రైళ్లు మాత్రం విజయనగరం, విశాఖ, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, నాందేడ్, శ్రీకాకుళం వరకు వెళ్తాయి. ప్రత్యేక రైళ్ల నిర్వహణ కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ అనేక జాగ్రత్తలు తీసుకుంది. వీటిల్లో చాలా రైళ్లను చర్లపల్లి నుంచి బయల్దేరేలా షెడ్యూల్ చేసింది. మరికొన్నింటిని లింగంపలలి, బేగంపేట, హైటెక్ సిటీ నుంచి కూడా బయల్దేరేలా ప్లాన్ చేసింది.

  Last Updated: 10 Jan 2026, 03:00 PM IST