రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్ 16 నుంచి కొత్త ఎయిర్‌బస్ సర్వీసులు ప్రారంభం!

Air Buses : ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎయిర్‌బస్‌లు అందుబాటులోకి రానున్నాయి. రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ నెల 16 నుండి రెండు ఎయిర్‌బస్‌ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికుల సామర్థ్యం 600 నుండి 800కి పెరిగే అవకాశం ఉంది. బెంగళూరుకు కూడా అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసును ప్రారంభించే యోచనలో ఉంది. ఏపీ నుంచి కొత్తగా ఎయిర్‌బస్ సర్వీసులు రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు కూడా […]

Published By: HashtagU Telugu Desk
Rajahmundry Airport

Rajahmundry Airport

Air Buses : ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎయిర్‌బస్‌లు అందుబాటులోకి రానున్నాయి. రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ నెల 16 నుండి రెండు ఎయిర్‌బస్‌ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికుల సామర్థ్యం 600 నుండి 800కి పెరిగే అవకాశం ఉంది. బెంగళూరుకు కూడా అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసును ప్రారంభించే యోచనలో ఉంది.

  • ఏపీ నుంచి కొత్తగా ఎయిర్‌బస్ సర్వీసులు
  • రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు కూడా
  • ఈ నెల 16 నుంచి ప్రారంభించే అవకాశం

ఏపీ నుంచి కొత్తగా ఎయిర్‌బస్‌లు అందుబాటులోకి రానున్నాయి.. విజయవాడంతో పాటుగా పలు విమానాశ్రయాల నుంచి ఈ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. నిన్నటి వరకు చిన్న విమాన సర్వీసులకే పరిమితమైన రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం నుంచి ఈ ఎయిర్‌బస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 16 నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్‌బస్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు రెండు ఎయిర్‌బస్‌ సర్వీసులు కొత్తగా ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. ఢిల్లీ, మొంబై మాత్రమే ఉన్న ఈ సర్వీసులు.. ఇక ఏపీ-తెలంగాణ మధ్య కూడా నడవనున్నాయి. అలాగే ఈ సర్వీసుల సంఖ్య నాలుగుకు చేరుతుంది.

వాస్తవానికి ప్రతి రోజూ హైదరాబాద్‌కు ఆరు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.. వాటిలో దాదాపు 600మంది ప్రయాణిస్తున్నారు. అయితే ఈ నెల 16 నుంచి మాత్రం ఐదు ఏటీఆర్ సర్వీసుల బదులు రెండు ఎయిర్‌బస్‌లు ప్రారంభమవుతాయి అంటున్నారు.. 600మంది ప్రయాణికుల కాస్త 800 మందికి చేరే అవకాశం ఉంటుంది. అంతేకాదు రాజమహేంద్రవరం నుంచి మరో కొత్త విమాన సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలయన్స్‌ ఎయిర్‌ సంస్థ బెంగళూరుకు మరో విమాన సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోందట. ఇండిగో రాత్రి సమయంలో ఓ సర్వీస్ నడుపుతుండగా.. ఇప్పుడు పగలు కూడా మరో సర్వీస్ నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌కు ప్రస్తుతం ఏటీఆర్‌ విమానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ విమానాలు 72 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హైదరాబాద్‌కు ప్రయాణికుల డిమాండ్ పెరిగింది.. మొదట్లో కేవలం ఒక సర్వీసుతో ప్రారంభమై ఆరు సర్వీసులకు చేరింది. అయితే భవిష్యత్తులో ఏటీఆర్‌ విమానాల సంఖ్యను తగ్గించి.. వాటి స్థానంలో ఎయిర్‌బస్‌ విమానాలకు ప్రాధాన్యత పెంచాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ఎయిర్‌బస్‌ విమానాలు ఒకేసారి 180 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టుగా విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి భారతీయ విమానాశ్రయాల అధికార సంస్థ (AAI) చురుగ్గా కృషి చేస్తోంది. ఇందుకోసం విమానయాన సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా, భవిష్యత్తులో మరిన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని AAI లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యల ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలని భావిస్తన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 9.30 గంటలకు సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరుకు రాత్రి 7.15 గంటలకు సర్వీస్ అందుబాటులో ఉంది. అలాగే ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరుపతికి కూడా సర్వీసులు నడుస్తున్న సంగతి తెలిసిందే.

  Last Updated: 15 Dec 2025, 04:42 PM IST