ఏపీ ప్రజలకు ఇది కచ్చితంగా శుభవార్తే. త్వరలోనే విశాఖ రైల్వే జోన్ షురూ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ను కేంద్రమంత్రి త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి వివాదాలు లేవన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు కూడా ప్రారంభించింది. ఈ విషయాలను గతంలో పార్లమెంట్ లోనే రైల్వే శాఖ సమాధానం ఇచ్చిందన్నారు. ఇవాళ ఉదయం రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠితో మాట్లాడినట్లు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు భవన నిర్మాణం విషయంలో ఓ కమిటీ వేసినట్లుగా రైల్వే బోర్డు ఛైర్మన్ చెప్పటినట్లుగా జీవిఎల్ వెల్లడించారు. ఏపీ న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో రైల్వే జోన్ ఇచ్చారన్నారు.