Summer Special Trains : 15 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయ్.. వివరాలివీ

Summer Special Trains : వేసవి వేళ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎక్కడ చూసినా ట్రైన్స్ నిండిపోయి కనిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 01:44 PM IST

Summer Special Trains : వేసవి వేళ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఎక్కడ చూసినా ట్రైన్స్ నిండిపోయి కనిపిస్తున్నాయి. అందుకే ట్రైన్‌లో వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణమధ్య రైల్వే  15 ప్రత్యేక రైళ్లను  నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు మే 1 నుంచి ఆగస్టు 2 వరకు షెడ్యూల్‌ వారీగా రాకపోకలు సాగిస్తాయి. పాట్నా – సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ – పాట్నా, దానాపూర్‌ – సికింద్రాబాద్‌, దనపూర్‌ – బెంగుళూరు వంటి స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్ల వేళలు, రిజర్వేషన్‌ తదితర వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ సీజన్‌లో టూర్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారందరికీ ఈ స్పెషల్ ట్రైన్లతో(Summer Special Trains) ఎంతో సౌకర్యం కలుగనుంది.

We’re now on WhatsApp. Click to Join

వేసవి ప్రత్యేక రైళ్ల వివరాలివీ.. 

  • ఎస్‌ఎంవీ బెంగళూరు – మాల్దా టౌన్‌ (06563) ప్రత్యేక రైలు ఈ నెల 14 నుంచి మే 5 వరకు ప్రతి ఆదివారం రాత్రి 11.40 గంటలకు బెంగళూరులో బయలుదేరి మర్నాడు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడకు వచ్చి.. 6.15 గంటలకు వెళుతుంది.
  • మాల్దా టౌన్‌-ఎస్‌ఎంవీ బెంగళూరు (06564) ప్రత్యేక రైలు ఈనెల 17 నుంచి మే 8 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటలకు మాల్దా టౌన్‌లో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 3.08 గంటలకు దువ్వాడకు వచ్చి.. 3.10 గంటలకు వెళ్తుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, ఒంగోలు, విజయవాడ, రాజమహేంద్రవరం, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగుతుంది.
  • ఈనెల 15 నుంచి మే 6 వరకు మైసూర్‌-ముజఫర్‌పూర్‌(06221) రైలు ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటలకు మైసూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.18 గంటలకు దువ్వాడకు వచ్చి.. 7.20 గంటలకు వెళుతుంది.
  • ముజఫర్‌పూర్‌-మైసూర్‌(06222) రైలు ఈనెల 18 నుంచి మే 9 వరకు ప్రతి గురువారం మధ్యాహ్నం 1 గంటకు ముజఫర్‌పూర్‌లో బయలుదేరి మర్నాడు రాత్రి 7.18 గంటలకు దువ్వాడకు వచ్చి.. రాత్రి 7.20 గంటలకు వెళుతుంది. రేణిగుంట, గూడూరు, ఒంగోలు, విజయవాడ, రాజమహేంద్రవరం, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస జంక్షన్, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగుతుంది.

Also Read :Ayodhya : సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..శ్రీరామ నవమికి 40 లక్షల మంది భక్తులు..!