ఏపీలో విద్యార్థులకు గుడ్స్యూస్.. జనవరి నెలలో 12 రోజులు సెలవులే

Andhra Pradesh : సంక్రాంతి పండుగ వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్‌లో సందడి మొదలైంది. జనవరి 2026లో స్కూల్ విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొన్ని సాధారణ, ఆప్షనల్ సెలవులున్నాయి. ఈ నెలలో మొత్తం 31 రోజులకు గాను విద్యార్థులకు 13 రోజులు సెలవులు వస్తున్నాయి. సంక్రాంతి పండుగతో పాటు గణతంత్ర దినోత్సవం కూడా సెలవుల జాబితాలో ఉన్నాయి. ఏపీలో జనవరి నెలలో 13 రోజులు సెలవులు సంక్రాంతితో పాటుగా మరికొన్ని సెలవులు […]

Published By: HashtagU Telugu Desk
ap schools sankranti holidays

ap schools sankranti holidays

Andhra Pradesh : సంక్రాంతి పండుగ వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్‌లో సందడి మొదలైంది. జనవరి 2026లో స్కూల్ విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొన్ని సాధారణ, ఆప్షనల్ సెలవులున్నాయి. ఈ నెలలో మొత్తం 31 రోజులకు గాను విద్యార్థులకు 13 రోజులు సెలవులు వస్తున్నాయి. సంక్రాంతి పండుగతో పాటు గణతంత్ర దినోత్సవం కూడా సెలవుల జాబితాలో ఉన్నాయి.

  • ఏపీలో జనవరి నెలలో 13 రోజులు సెలవులు
  • సంక్రాంతితో పాటుగా మరికొన్ని సెలవులు
  • సంక్రాంతికి 9 రోజుల పాటూ సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందడి మొదలైంది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు జనవరి నెలలో సంక్రాంతికి స్కూల్ విద్యార్థులకు సెలవులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ ఏడాది కూడా స్కూల్ విద్యార్థులకు 9 రోజుల పాటూ సెలవులు ప్రకటించారు. ఈ 9 రోజుల పాటూ మరికొన్ని సెలవు దినాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సెలవులు, ఆప్షనల్ హాలిడేస్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం జనవరి 2026 సెలవుల జాబితా ఇలా ఉంది.

సాధారణ సెలవుల విషయానికి వస్తే.. 04-01-2026 – ఆదివారం, 10-01-2026 – రెండో శనివారం, 11-01-2026 – ఆదివారం, 14-01-2026 – భోగి (బుధవారం), 15-01-2026 – మకర సంక్రాంతి (గురువారం), 16-01-2026 – కనుమ (శుక్రవారం), 18-01-2026 – ఆదివారం, 25-01-2026 – ఆదివారం, 26-01-2026 – గణతంత్ర దినోత్సవం (సోమవారం), 31-01-2026 – ఆదివారం సెలవు దినాలు ఉన్నాయి. ఆప్షనల్ సెలవులు.. 01-01-2026 – నూతన సంవత్సరం (గురువారం), 03-01-2026 – హజ్రత్ అలీ (R.A.) జయంతి (శనివారం), 16-01-2026 – షబ్-ఎ-మెరాజ్ (శుక్రవారం). జనవరిలో మొత్తం 31 రోజులకు సెలవులు 9 కాగా.. పని దినాలు 22గా ఉన్నాయి. ఈ సాధారణ సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి.

స్కూల్ విద్యార్థుల సెలవుల విషయానికి వస్తే.. 04-01-2026 – ఆదివారం, 10-01-2026 – రెండో శనివారం సెలవు దినాలు.. అలాగే 11-01-2026 – ఆదివారం, 12-01-2026- సంక్రాంతికి సెలవు (సోమవారం), 13-01-2026- సంక్రాంతికి సెలవు (మంగళవారం), 14-01-2026 – భోగి (బుధవారం), 15-01-2026 – మకర సంక్రాంతి (గురువారం), 16-01-2026 – కనుమ (శుక్రవారం), 17-01-2026- సంక్రాంతికి సెలవు (శనివారం), 18-01-2026 – ఆదివారం, 25-01-2026 – ఆదివారం, 26-01-2026 – గణతంత్ర దినోత్సవం (సోమవారం), 31-01-2026 – ఆదివారం సెలవు దినాలు ఉన్నాయి. జనవరిలో మొత్తం 31 రోజులకు సెలవులు 13 సెలవులు ఉన్నాయి. మొత్తం మీద జనవరిలో విద్యార్థులకు సెలవులు చాలానే ఉన్నాయి.

  Last Updated: 02 Jan 2026, 10:58 AM IST