ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) పింఛనుదారులకు మరోసారి శుభవార్త (Good news for pensioners) అందించింది. ఎన్టీఆర్ భరోసా పథకం (NTR Bharosa Scheme) కింద పింఛన్ విధానంపై స్పష్టత ఇవ్వడమే కాకుండా, పింఛన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. గతంలో పెన్షన్లను తొలగిస్తున్నారని వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం తగిన వివరణ ఇచ్చింది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ సభ్యులు పెన్షన్లలో కోతలు విధించారని చేసిన ఆరోపణలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండలి సమావేశంలో సమాధానం ఇచ్చారు. పెన్షన్ తొలగింపునకు ప్రభుత్వ విధానాల కారణం కాదని, గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Minister Lokesh: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ: మంత్రి లోకేష్
రాష్ట్రంలో 13% జనాభాకు పెన్షన్లు అందుతున్నాయి. 2019 నుంచి 2024 మధ్య 24 లక్షల పెన్షన్లు తొలగించబడ్డాయని తెలిపారు. అయితే కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పెన్షన్ పొందే వ్యక్తి మరణించిన తర్వాత, ఆయన జీవిత భాగస్వామికి పెన్షన్ అందించే ‘స్పౌజ్ పెన్షన్’ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇదే కాకుండా పింఛన్ బదిలీకి కూడా అవకాశం కల్పించడంతో చాలా మంది లబ్ధిదారులకు ఊరట లభించనుంది.
ప్రస్తుతం పెన్షన్ల కోసం 13 పాయింట్ల వెరిఫికేషన్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీని వల్ల లబ్ధిదారులు పింఛన్ మంజూరు ప్రక్రియలో ఎదుర్కొనే జాప్యాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యల కారణంగా అర్హులైన వారికి ఎప్పుడైనా హెల్త్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుందని మంత్రి వెల్లడించారు. పింఛన్ విధానంలో తీసుకొచ్చిన ఈ మార్పులు పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం కలిగించనున్నాయి.