APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు మార్గం మధ్యలో పంచారామ క్షేత్రాలను దర్శించుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇందుకోసం ఆరు, ఏడు రోజుల చొప్పున టూర్ ప్యాకేజీలను ప్రకటించారు. విశాఖ నుంచి నడిచే ప్రత్యేక బస్సుల విషయానికి వస్తే.. 5 రోజుల ప్యాకేజీలో భాగంగా బస్సు విశాఖలో బయలుదేరి విజయవాడ, మేల్ మర ఒత్తూరు, ఎరిమేలి మీదుగా పంబ సన్నిధానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ నుంచి విశాఖకు వస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక 7 రోజుల యాత్రలో భాగంగా బస్సు విశాఖ నుంచి విజయవాడ, కాళహస్తి, బెంగళూరు, మైసూరు, గురువారాయి, ఎరిమేలి మీదుగా పంబ సన్నిధానానికి చేరుకుంటుంది. ఏడు రోజుల టూర్ సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ.7000, అల్ట్రా డీలక్స్ టికెట్ ధర రూ.6900. ఇతర రీజియన్ల ఆర్టీసీ అధికారులు కూడా అయ్యప్ప స్వాముల కోసం టూర్ ప్యాకేజీలను రెడీ చేస్తున్నారు. పార్వతీపురం నుంచి ఈ నెల 19, 26, డిసెంబర్ 3, 10 తేదీల్లో సర్వీసులు నడుపనున్నారు.ఈ టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ కోసం 73828 34904కు కాల్ చేయాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్లోనూ టికెట్లు బుక్(APSRTC) చేసుకోవచ్చన్నారు.