Site icon HashtagU Telugu

Summer Holidays : విద్యార్థులకు ఈసారి భారీగా సమ్మర్ హాలిడేస్.. ఎన్నో తెలుసా ?

Dussehra Holidays

Dussehra Holidays

Summer Holidays : ఆంధ్రప్రదేశ్‌లోని స్కూలు విద్యార్థులకు గుడ్ న్యూస్.  ఎండల తీవ్రత కారణంగా ఈసారి సమ్మర్ హాలిడేస్ ముందే మొదలయ్యే ఛాన్స్ ఉంది. స్కూళ్లకు గతేడాది మే 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వగా 42 రోజుల సెలవుల తర్వాత జూన్ 12న తిరిగి తెరచుకున్నాయి. ఎండల తీవ్రత కారణంగా  ఈసారి  ఒకవారం ముందే సమ్మర్ హాలిడేస్(Summer Holidays) మొదలయ్యే అవకాశం ఉంది.  ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేస‌వి సెల‌వులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 50 రోజులు అంటే జూన్ 13 వ‌రకు పాఠశాలలకు వేస‌వి సెల‌వులు ఉంటాయి. దీనిపై ఏపీ విద్యాశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టెన్త్ పరీక్షలు పూర్తయిన వెంటనే సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది. మార్చి 30 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయి. పదో తరగతి విద్యార్థుల‌కు ఈసారి దాదాపు 60 రోజుల వేస‌వి సెల‌వులు వస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

ఎండల తీవ్రత కారణంగా ఏపీలో ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు మార్చి 18 నుంచి ఒకపూట బడులు నిర్వహి స్తున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు జరుగుతున్నాయి. విద్యాశాఖ ఆదేశాల మేరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 23 వరకు రాష్ట్రంలోని స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. పదోతరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలో పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

Also Read :Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా సంస్థ అధినేత, ఓ కీలక నేత!

ఏప్రిల్ 6 నుంచి 19 వరకు..

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు షురూ కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 6 నుంచి 19 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే షెడ్యూలులో మార్పులుంటాయని విద్యాశాఖ తెలిపింది.

Also Read :Delhi Liquor Scam : ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌’లో కీలక పరిణామం.. కేసు విచారిస్తున్న జడ్జి బదిలీ