Site icon HashtagU Telugu

CM JAGAN: ఏపీ రైతులకు శుభవార్త. ఈనెల 28 అకౌంట్లలో నగదు జమ..!!

Jagan Money

Jagan Money

ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 2022 ఖరీఫ్ సీజన్లో ప్రక్రుతి వైపరిత్యాల వల్ల పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సీజన్ ముగియకముందే పంట నష్టపరిహారం పంపిణీ చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలు, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 60,832ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా అధికారులు గుర్తించారు. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పంటలు నష్టపోయినట్లు తెలిపారు.

పంటనష్టపోయిన రైతులకు మొత్తం రూ. 59.39కోట్ల నష్ట పరిహారం అందించాలని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మేరకు రైతుల జాబితాలను ఇప్పటికే జిల్లాల వారీగా సేకరిస్తున్నారు. గత మూడు సంవత్సరాల్లో 20.85లక్షల మందికి 1,795.4కోట్ల పంటనష్టపరిహారం అందించింది ప్రభుత్వం. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 45,998మంది రైతులకు ఈనెల 28వ తారీఖున రూ. 39.39కోట్లు జమ చేయనున్నారు. అదే రోజు రబీ సీజన్ కు సంబంధించి కూడా 45.33కోట్లు ., ఖరీఫ్ కు 115.33కోట్లు చొప్పున 160.55కోట్లు జీరో వడ్డీ జమచేయనున్నారు. ఈ మొత్తాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.