అమరావతి రైతులకు గుడ్ న్యూస్..ఉండవల్లిలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు !

Amaravati Farmers Land Allotment  రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ-లాటరీ పద్ధతి […]

Published By: HashtagU Telugu Desk
amaravati farmers land allotment

amaravati farmers land allotment

Amaravati Farmers Land Allotment  రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

  • ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల కేటాయింపు
  • ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్ల కేటాయింపు
  • 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్లను కేటాయించనున్న ప్రభుత్వం

అలాగే, ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ-లాటరీ నిర్వహించనున్నారు. మరోవైపు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు భవిష్యత్ అవసరాలు, విస్తరణ కోసం భూ సేకరణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

  Last Updated: 23 Jan 2026, 11:10 AM IST