Site icon HashtagU Telugu

Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఏపీఎస్‌ఆర్టీసీ 6,795.. టీఎస్ఆర్టీసీ 4,484

Tsrtc Dasara Services

Tsrtc Dasara Services

Sankranti Special Buses : సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు నుంచి జనవరి 18 వరకు 6,795 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది. రెగ్యులర్‌ సర్వీసులకు  ఇవి అదనం. ఇవాళ్టి నుంచే ఈ బస్సులు రోడ్డెక్కాయి. ఈ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నారు. జనవరి 6 నుంచి 14 వరకు 3,570 బస్సులు, జనవరి 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడిపేలా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య రెగ్యులర్‌ సర్వీసుల్లో ముందుస్తు రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆయా మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వీటిల్లో కూడా రిజర్వేషన్లు మొదలయ్యాయి. ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌, చెన్నై,బెంగళూరు తదితర నగరాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ప్రయాణికులు సమాచారం తెలుసుకునేందుకు 149 నెంబర్ తో పాటు 0866-2570005 నంబరును ఏపీఎస్ ఆర్టీసీ(Sankranti Special Buses) అందుబాటులోకి తీసుకొచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

టీఎస్ఆర్టీసీ 4,484 బస్సులు..

సంక్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెస్తామని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. జనవరి 6 నుంచి జనవరి 15 వరకు హైదరాబాద్ నుంచి కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్రలలోని పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రత్యేక బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని సంస్థ ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అన్నీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. చార్జీలపై ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ చార్జీల తోనే ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు.

Also Read: Instagram Shopping : ఇన్‌స్టా‌గ్రామ్‌లో షాపింగ్ చేస్తున్నారా.. ఇవి గుర్తుంచుకోండి

ఇప్పటిదాకా 7 కోట్ల మంది మహిళలకు ఫ్రీ జర్నీ

తెలంగాణ ఆర్టీసీకి ప్రయాణికులతో పాటు కార్మికులు కూడా రెండు కళ్లలాంటి వారని,  త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని సంస్థ వీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఇప్పటివరకు ఏడు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారని వివరించారు. విధి నిర్వహణలో కార్మికులను ప్రోత్సహించడం ద్వారా సంస్థ అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులందరూ కష్టపడి పనిచేయడం వల్లనే ఆర్టీసీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.విధి నిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనే ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలిగించాలనే ఉద్దేశంతో వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.