Site icon HashtagU Telugu

CBN Is Back : ఇక్కడ బాబు..అక్కడ మోడీ..ఏపీకి ఇక మంచిరోజులేనా..?

Modi Cbn

Modi Cbn

ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మొదటి సీఎం గా చంద్రబాబు (Chandrababu) బాధ్యతలు చేపట్టాడు. కొత్త రాష్ట్రం భావితరాల వరకు ఎలా ఉండాలని ఓ ప్రణాళిక సిద్ధం చేసాడు. మెట్టు మెట్టు కట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నారు. అమరావతి రాజధాని గా ప్రకటన చేసారు. ఆ మేరకు డెవలప్మెంట్ స్టార్ట్ చేసారు. ఇలా అన్ని చూసుకునేసరికి సమయం అయిపోయింది..ఇదే తరుణంలో జగన్ ఫ్యాన్ గాలి గట్టిగా వీయడంతో ప్రజలంతా జగన్ కు ఛాన్స్ ఇచ్చారు. జగన్ ఏదో చేస్తాడని అంత అనుకున్నారు..కానీ జగన్ వచ్చిన మూడు నెలలకే ప్రజలకు జగన్ బాదుడు అర్థమైంది. కానీ ఏంచేయలేని పరిస్థితి. వైసీపీ నేతల ఆగడాలను చూస్తూ టైం కోసం ఎదురుచూసారు. ఇక 2024 ఎన్నికల్లో వారి ఆగ్రహం మొత్తం చూపించి జగన్ & బ్యాచ్ కి కోలుకోలేని దెబ్బ కొట్టారు. కేవలం 11 సీట్లలో గెలిపించి ప్రతిపక్షానికి కూడా పనికిరాకుండా చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

కూటమి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఓట్లు గుద్దేసారు. రాష్ట్రంలో అసలు బిజెపి (BJP) అనేది లేని దగ్గర కూడా ఆ నేతలను గెలిపించారు. అంతే కాదు కేంద్రంలో మరోసారి ఏర్పడబోయే ఎన్డీయే కూటమిలో టీడీపీ ప్రాతినిధ్యం కీలకం కావడంతో ఈ అవకాశాన్ని ఏపీ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. బీజేపీ కూడా టీడీపీ విషయంలో సానుకూల ధోరణిని అవలంభించనుండటం ఖాయం. కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి పదవులను చంద్రబాబు కోరినా అందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. దీంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని చంద్రబాబు & కో చూస్తున్నారు. అలాగే ఏపీకి రావాల్సిన నిధులు , పోలవరం , ప్రత్యేక హోదా , నీటి వనరులు ఇలా అన్ని కూడా తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇలా ఏపీకి కావాల్సిన వాన్ని తెచ్చుకుంటే ఇక ఏపీకి మంచిరోజులే అని అంత భావిస్తున్నారు. అంతే కాదు చంద్రబాబు విజన్ తో ఏపీ త్వరలోనే ఎంతో డెవలప్ అవుతుందని , అనేక పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. చూద్దాం మరి బాబు ఏంచేస్థాడో..!!

Read Also : Ministries Race : ఆ ఆరు మంత్రి పదవులు అడగొద్దు.. ఎన్డీయే మిత్రపక్షాలకు బీజేపీ నో !