Site icon HashtagU Telugu

Gone Prakash Rao : గోనె ప్రకాష్ రావు జోస్యం నిజం అవుతుందా..?

Gone Prakashrao

Gone Prakashrao

గోనె ప్రకాష్ రావు పేరు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించబోతుందని..ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని , సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడని ఎన్నికలకు ఏడు నెలల ముందే జోస్యం తెలిపాడు. ఈయన చెప్పినట్లే జరగడం తో అంత షాక్ అయ్యారు. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పడబ్బా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా ఈయన ఏపీ ఎన్నికల ఫై కూడా జోస్యం తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో కూటమి విజయం సాదించబోతున్నట్లు..తెలుగుదేశం పార్టీ – జనసేన- బీజేపీ కూటమి 145 సీట్లు సాధిస్తుందని తెలిపాడు. బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో టీడీపీకి కొంత మేర నష్టం జరిగిందని, అయినా భారీ మెజార్టీతో కూటమి గెలువబోతోందని గోనె స్పష్టం చేసారు. మోడీ,షా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందని చెప్పుకొచ్చారు. అంతే కాదు జిల్లాల వారీగా కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుందో కూడా చెప్పడం తో ఈయన చెప్పింది..నిజం అవుతుందా అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకవేళ ఈయన చెప్పిందే నిజం అయితే ఇక ఈయనకు తిరుగుండదు. ప్రస్తుతం సర్వేలు కూడా కూటమి విజయం సాదించబోతుందని చెపుతుండడం తో గొనె చెప్పింది నిజం అవుతుందని నమ్ముతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!!

ఇక గోనె ప్రకాష్ రావు విషయానికి వస్తే..

గోనె ప్రకాశ్‌రావు విద్యార్థి దశ నుండే రాజకీయ పట్ల ఆసక్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1983లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి సంజయ్‌విచార్‌మంచ్‌ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి 6427 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఆరునెలలకు తన పదవికి రాజీనామా చేశాడు. గోనె ప్రకాశరావు తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వై.యస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి చనిపోవడంతో ఆయన కుమారుడు పెట్టిన వైసీపీలో చేరి కొంతకాలం పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమై విశ్లేషకుడిగా మారాడు.

Read Also :  Chandrababu : బొత్స నియోజకవర్గంలో.. టీడీపీ హవా..!