Site icon HashtagU Telugu

Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా

Gollapalli Surya Rao Resign

Gollapalli Surya Rao Resign

 

Gollapalli Surya Rao: కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ(tdp)కి రాజీనామా(resigns) చేశారు. రాజోలు టికెట్ ను ఆశిస్తున్న ఆయన తాజా పరిణామాలతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబు(chandrababu)ను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.

టీడీపీలో నిజాయతీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గొల్లపల్లి ధ్వజమెత్తారు. పార్టీలో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు మద్దతు ఇవ్వడం తన బాధ్యతగా భావిస్తున్నానని వివరించారు.

ఇటీవల టీడీపీ మొదటి జాబితా విడుదల చేయగా, అందులో గొల్లపల్లి సూర్యారావు పేరు కనిపించలేదు. గత రాత్రి గొల్లపల్లి… విజయవాడ ఎంపీ కేశినేని నానితో భేటీ కావడంతోనే ఆయన వైసీపీలోకి వచ్చే విషయంపై స్పష్టత వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ జనసేన పొత్తులో( TDP Janasena Alliance ) భాగంగా రాజోలు నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయించాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే తనకు టికెట్ రాదని భావించిన సూర్యారావు పార్టీని వీడారని తెలుస్తోంది. ఇక తాజాగా గొల్లపల్లి విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎంపీ మిథున్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ( YCP ) గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

read also :  Himachal Crisis: క్రాస్ ఓటింగ్ తో అలర్ట్ అయిన కాంగ్రెస్.. సిమ్లాకు డీకే