రెండు తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ గోదావరి ఎక్స్ ప్రెస్ (Godavari Express) గోల్డెన్ జూబ్లీ (Golden Jubilee) జరుపుకుంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం (1974) ఫిబ్రవరి ఒకటో తేదీన స్టీమ్ ఇంజన్‌తో మొట్టమొదటిసారి పట్టాలు ఎక్కింది. ఈ రైలు మొదటి సారి వాల్తేరు-హైదరాబాద్ మధ్య నడిచింది. ట్రైన్ నెంబర్లు 7007, 7008 తో ఈ రైలు ను ప్రవేశపెట్టారు. ఈ రైలు ప్రస్తుత ట్రైన్ నెంబర్లు 12727, 12728. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా ఈ రైలుకు పూర్తి స్థాయి ఏ.సి సదుపాయం ఉన్న గరీబ్ రథ్, దురోంతో లు ప్రవేశపెట్టటంతో ఈ రైళ్ళలో ప్రజల రద్దీ ఇంకా పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
రెండు కొత్త రైళ్ళు ప్రవేశపెట్టినప్పటికీ, ఈ రైలుకి ఇప్పటికి భారీ రద్దీ ఉంది. ప్రజల డిమాండ్ మేరకు కొన్నిమార్లు రిజర్వేషన్ లేని జనరల్ భోగీలను స్లీపర్, మూడవ క్లాసు భోగిలతో మారుస్తుంటారు.విశాఖ, హైదరాబాద్ మధ్య వెళ్ళు రైలు మార్గాలలో ఈ రైలు వెళ్ళే మార్గాన్ని ఉత్తమంగా భావిస్తారు. అందుకే అధికారులు దీన్ని శుభ్రంగా ఉంచుతారు. ఇది ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో ఉంది .ఈ రైలును భుభనేశ్వర్ వరకు పొడిగించలనీ ప్రతిపాదనలు వచ్చిన ప్రజలు, రాజకీయ నాయకులూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ఆ తరువాత విశాఖ ఎక్స్ప్రెస్కి ప్రతిపాదనలు వచ్చాయి, వాటిని ఆమోదించారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి ఎక్స్‌ప్రెస్ సమయపాలనలో పక్కాగా ఉంటూ విశాఖ- HYD మధ్య నడుస్తూ ప్రయాణికులకు ఫేవరెట్ గా మారింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా నిలిచిన ఈ ట్రైన్ 50 వసంతాల వేడుకను అధికారులు ఘనంగా నిర్వహించారు. విశాఖ స్టేషన్‌లోని ప్లాట్‌ఫార్మ్‌పై రైల్వే అధికారులు, ప్రజలు కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా రైలును ప్రత్యేకంగా అలంకరించారు. రంగు రంగుల పూలతో సుందరంగా తీర్చిదిద్ది… దాని ముందు రైల్వే సిబ్బంది కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు చేసేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది. నేటి రాత్రి 11 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో గోదావరి ఎక్స్‌ప్రెస్ సంబరాలు జరపనున్నారు.
Read Also : AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 07 న ఢిల్లీలో జేడీ ధర్నా
