ఏపీలో కూటమి సర్కార్ (NDA Govt) సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందం నింపుతుంది. హామీలు ప్రకటించే ప్రభుత్వం కాదు హామీలను నెరవేర్చే ప్రభుత్వం అని మరోసారి చంద్రబాబు (CM Chandrababu) నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఓ పక్క నెరవేరుస్తూనే, మరోపక్క కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను మరింత సంతోష పెడుతున్నారు. తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోకులాలను (Gokulas ) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
JIO Warning : కాల్ బ్యాక్ చేస్తే రూ.300 కట్..!
ఈ కార్యక్రమం (Gokulas Program) జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనుంది. పశువులకు, మేకలు, గొర్రెలు, కోళ్లకు షెల్టర్ల కోసం ఈ గోకులాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణాభివృద్ధి పథకంలో కీలక ముందడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గోకులాల ప్రారంభోత్సవాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచనలు జారీ అయ్యాయి. కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనవరి 10న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతుందని సమాచారం.
Memorial for Pranab Mukherjee : RSSపై ప్రేమవల్లే ప్రణబ్‌కు స్మారకం – ఎంపీ డానిష్ అలీ
ప్రారంభోత్సవాల ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ జిల్లాల కలెక్టర్లు, డ్వామా స్కీమ్ సంచాలకులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాలో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్ని ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. గోకులాల నిర్మాణం ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనుల సారాంశంలో ఒక భాగమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె పండగ- పంచాయతీ వారోత్సవాల్లో గ్రామ సభల ద్వారా తీర్మానించిన పనులను వేగంగా పూర్తి చేయడం ద్వారా గ్రామీణాభివృద్ధికి నూతన శక్తిని అందించామని అధికారులు పేర్కొన్నారు. ప్రారంభోత్సవాలకు సంబంధించి బ్లూఫ్రాగ్ మొబైల్ యాప్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ గోకులాలు పశు సంరక్షణకు తోడ్పడటంతో పాటు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.