ఏపీలో వరుస అత్యాచారాలు (Rape Incident) ఆగడం లేదు..వరుసగా రాష్ట్రంలో ఎక్కడో చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తునప్పటికీ కామాంధులు మాత్రం వారి అరాచకాలను ఆపడం లేదు. కామంతో అభంశుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. యువకులే కాదు 60 , 70 ఏళ్ల వయసు ఉన్న వృద్దులు కూడా అత్యాచారాలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. మరికొంతమంది స్నేహం ముసుగులో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా అనకాపల్లి లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. తనతో కాకుండా మరొకరితో స్నేహం చేస్తుందనే కోపంతో స్నేహితురాలి ఫై అత్యాచారం చేసాడు ఓ యువకుడు. ఈ ఘటన అనకాపల్లి (Anakapally) జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం లో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
అనకాపల్లికి చెందిన యువతి(19) .. సాయి కుమార్ తో కొంతకాలంగా స్నేహం చేస్తుంది. అయితే ఆ యువతి, ఆమె స్నేహితురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని కోపం పెంచుకున్న సాయి కుమార్..సింహాచలానికి వెళ్తున్న సదరు యువతీఫై కన్నేశాడు. సింహాచలం వెళ్లుతున్న యువతిని మధ్యలో అడ్డుకొని..బొజ్జన్న కొండుకు తీసుకెళ్లాడు. అక్కడే సాయికుమార్, అతని మిత్రులు ఆ యువతిని బెదిరించారు. దీంతో భయపడి సదరు యువతీ ఏలేలు కాలువలోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో సాయికుమార్, అతని మిత్రులు వెంటనే ఆమెను కాపాడారు. సమీపంలోని హ్యాపీ హౌస్‌కు తీసుకెళ్లారు. బాధిత యువతి వాష్ రూమ్‌లో బట్టలు ఆరబెట్టుకుండుగా.. సాయికుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ యువతీ తన మిత్రురాలి ఇంటికి వెళ్లింది.
ఎంతసేపటికి ఇంటికి కూతురు రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్ నుంచి ఇంటికి వచ్చే సరికి కూతురు ఇంటికి వచ్చింది. దీంతో వెంటనే కూతురిని సమీపించి ఏమైందని వివరాలు అడిగారు. జరిగిన విషయం చెప్పడం తో పేరెంట్స్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సాయికుమార్‌తోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. కిడ్నాప్, అత్యాచరం నేరాల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.
Read Also : Raviteja Mr Bacchan Teaser : మిస్టర్ బచ్చన్ టీజర్.. మాస్ రాజాని పర్ఫెక్ట్ గా వాడేసిన డైరెక్టర్..!