Girl Missing Case : పవన్ కళ్యాణ్ చొరవతో 9 నెల‌ల క్రితం అదృశ్యమైన యువ‌తి ఆచూకీ ల‌భ్యం..

దాదాపు 9 నెలల క్రితం నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి పిర్యాదు చేశారు భీమవరంకు చెందిన శివ కుమారి

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 03:37 PM IST

ఏపీలో పెద్ద ఎత్తున అమ్మాయిలు అదృశ్యం (Girls Missing ) అవుతున్నారని..దీని పట్ల జగన్ పట్టించుకోవడం లేదని, పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని..2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అద్యశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పదే పదే చెపుతూ వచ్చారు.రాష్ట్రంలో మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు మిస్సింగ్ అవుతున్నారని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని నిలదీశారు. పవన్ మొదటి నుండి ఇది చెపుతున్న గత ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ పట్టించుకున్న పాపన పోలేదు. ఇక అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..ఆపని చేయడం మొదలుపెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

నేరుగా రణగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి , జనసేన ధినేత పవన్ కళ్యాణ్..అమ్మాయిలు మిస్సింగ్ ఫై ఎక్కడిక్కడే అరా తీయడం స్టార్ట్ చేసారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మిస్ అయ్యారు..ఎప్పుడు మిస్ అయ్యారని..అనే వివరాలను పోలీసులను అడిగితెలుసుకోవడం స్టార్ట్ చేసారు. ఈ క్రమంలో 9 నెలల క్రితం అదృశ్యమైన అమ్మాయి ఆచూకీ లభ్యమైంది. దాదాపు 9 నెలల క్రితం నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి పిర్యాదు చేశారు భీమవరంకు చెందిన శివ కుమారి .. దీంతో యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి ఆ యువ‌తిని ట్రేస్ చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్ర‌త్యేక పోలీస్ టీమ్ వారిని తీసుకొచ్చేందుకు జమ్మూ వెళ్లారు..అక్క‌డ వారిద్ద‌రిని అదుపులోకి తీసుకుని విజ‌య‌వాడ‌కు తీసుకొస్తున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలిసిందని తెలియగానే ఆ తల్లి ఎంతో సంతోషిస్తూ..పవన్ కళ్యాణ్ వల్లే తమ బిడ్డ ఆచూకీ తెలిసిందని..ఇలాగే మిస్సైన మిగతా పిల్లల ఆచూకీ కూడా తెలుసుకోవాలని కోరింది.

Read Also : EVM Vs Akhilesh Yadav : యూపీలో 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేష్