Site icon HashtagU Telugu

Gidugu Rudraraju: ఏపీ పీసీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజు

Gidugu Rudraraju

Gidugu Rudraraju

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన కొద్ది రోజుల్లోనే పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ దిశలోనే ఏపీసీసీ ప్రెసిడెంట్ గా గిడుగు రుద్రరాజుతో పాటు పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 34 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని నియమించింది.

వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా అధ్యక్షుడిగా మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, రాకేశ్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్‌, కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి పల్లం రాజు, మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ చైర్మన్‌ బాధ్యతలను తులసిరెడ్డికి అప్పగించింది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని గిడుగు రుద్రరాజు చెప్పారు. పార్టీ బలోపేతం దిశగా తగిన చర్యలు చేపడతామన్నారు.